రిలయన్స్ జియో గిగాఫైబర్ సేవల టారిఫ్స్ లీక్.. తక్కువ ధరకే ఎక్కువ బ్రాడ్‌బాండ్ సేవలు

రిలయన్స్ జియో గిగా ఫైబర్ బ్రాడ్‌బాండ్ కనెక్షన్‌తో హై స్పీడ్ ఇంటర్నెట్, అంతులేని వినోదం

Last Updated : Aug 3, 2018, 04:59 PM IST
రిలయన్స్ జియో గిగాఫైబర్ సేవల టారిఫ్స్ లీక్.. తక్కువ ధరకే ఎక్కువ బ్రాడ్‌బాండ్ సేవలు

రిలయన్స్ జియోతో ఉచిత కాల్స్, తక్కువ ధరకే వేగవంతమైన డేటా అందించి భారత టెలికాం రంగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన రిలయన్స్ సంస్థ తాజాగా బ్రాడ్‌బాండ్‌లోకి అడుగిడబోతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 1100 పట్టణాల్లో ఫిక్స్‌డ్ ఫైబర్ లైన్‌తో వ్యాపార సముదాయాలు, నివాసాలకు బ్రాడ్‌బాండ్ సేవలు అందించనున్నట్టు జూలై 5న జరిగిన 41వ వార్షికోత్సవ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ స్వయంగా ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి వినియోగదారులు ఈ ఫిక్స్‌డ్ లైన్ కోసం తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని ఈ సందర్భంగా ముకేష్ అంబానీ తెలిపారు. 

ఈ ఫైబర్ బ్రాడ్‌బాండ్ కనెక్షన్‌తో హై స్పీడ్ ఇంటర్నెట్, అత్యాధునిక టీవీల్లో వినోదాన్ని ఆస్వాదించేలా అల్ట్రా హై డెఫినిషన్ ఎంటర్‌టైన్‌మెంట్, మల్టీ-పార్టీ వీడియో కాన్ఫరెన్స్, రియాలిటీని తలపించే వర్చువల్ గేమింగ్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి సేవల్ని పొందవచ్చని అంబానీ స్పష్టంచేశారు. 

ఇదిలావుంటే ఇంకా రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభం కాకముందే ఈ రిలయన్స్ జియో గిగాఫైబర్ సేవల టారిఫ్స్ సోషల్ మీడియాలో లీకైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో లీకైన రిలయన్స్ జియో గిగాఫైబర్ టారిఫ్స్ ఇలా ఉన్నాయి. 

-> రూ.500 ప్లాన్: 50Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌తో నెల రోజుల వ్యాలిడిటీ కలిగిన 300 GB డేటా 

-> రూ.750 ప్లాన్: 50Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌తో నెల రోజుల వ్యాలిడిటీ కలిగిన 450 GB డేటా 

-> రూ.999 ప్లాన్: 100Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌తో నెల రోజుల వ్యాలిడిటీ కలిగిన 600 GB డేటా 

-> రూ.1,299 ప్లాన్: 100Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌తో నెల రోజుల వ్యాలిడిటీ కలిగిన 750 GB డేటా 

-> రూ.1,500 ప్లాన్: 150Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌తో నెల రోజుల వ్యాలిడిటీ కలిగిన 900 GB డేటా

Trending News