దేశంలోని రైతాంగానికి స్కైమెట్‌వెదర్.కామ్ శుభవార్త వినిపించింది. దేశంలో ఎప్పటికప్పుడు వాతావరణ స్థితిగతులపై తాజా సమాచారం అందించే స్కైమెట్ వెదర్ ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టంచేసింది. స్కైమెట్ వెదర్ రిపోర్ట్ ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సగటున 887 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కానుంది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో 55 శాతం సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉండగా ఇంకొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 20 శాతం అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్లు స్కైమెట్ వెదర్ వెల్లడించింది. 

 

96 నుంచి 104 శాతం మేర వర్షాలు కురిసినట్టయితే ఆ వాతావరణాన్ని సగటు వర్షపాతంగా పిలుస్తారని.., ఒకవేళ 90 శాతానికి తగ్గినట్టయితే దానిని కరువుగా పరిగణిస్తారని స్కైమెట్ వెదర్ పలు గణాంకాలతో సహా వివరించింది. అంతేకాకుండా 105-110 శాతం మధ్య వర్షాపాతం నమోదైతే, అది సగటు కన్నా అధిక వర్షపాతంగా, 110 శాతం కన్నా అధికంగా నమోదైతే, దానిని అత్యధిక వర్షపాతంగా పరిగణిస్తారని స్కైమెట్ వెదర్ పేర్కొంది.

English Title: 
Skymet Weather forecasts normal monsoon in India for 2018
News Source: 
Home Title: 

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన స్కైమెట్ !

2018లో వర్షాలపై రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన స్కైమెట్ వెదర్!
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
2018లో వర్షాలపై రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన స్కైమెట్ వెదర్ !

Trending News