UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ వాయిదా.. రెండు వారాల్లో తేదీ ఖరారు

దేశంలో అత్యున్నత సర్వీసులు అయిన యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేశారు.

Last Updated : May 5, 2020, 11:44 AM IST
UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ వాయిదా.. రెండు వారాల్లో తేదీ ఖరారు

న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత సర్వీసులు అయిన యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ను రెండో సారి మే 17వరకు పొడిగించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ సోమవారం సమావేశమై చర్చించిన అనంతరం మే 31న నిర్వహించాల్సిన ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

యూపీఎస్సీ ఓ అధికారి మాట్లాడుతూ.. లాక్‌డౌన్ పొడిగించిన కారణంగా ప్రిలిమ్స్‌ 2020 పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మే 20 తర్వాత మరోసారి సమీక్షించి పరీక్ష తేదీలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే సివిల్స్ అభ్యర్థులకు కనీసం నెల రోజుల ముందుగా పరీక్ష తేదీలపై స్పష్టత ఇస్తామన్నారు.  నటి పూజా ఝవేరి లేటెస్ట్ ఫోటోస్

సివిల్స్ ప్రిలిమ్స్‌తో పాటు మరిన్ని పరీక్షలు, ఇంటర్వ్యూలు వాయిదా వేశారు. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ 2020, సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామ్ 2019 ఇంటర్వ్యూలు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఎగ్జామ్ 2020, ఎన్‌డీఏ, నావల్ అకాడమీ ఎగ్జామ్ 2020 లాంటి మరిన్ని పరీక్షలు లాక్ డౌన్ కొనసాగింపు కారణంగా వాయిదా పడ్డాయి.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా! 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News