ఇంట్రెస్టింగ్ మ్యాటర్ షేర్ చేసిన ఉపాసన 

మెగా ఫ్యామిలీ కోడలు, హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఓ ఆసక్తికరమైన విషయాన్ని ట్వీట్ చేశారు.

Last Updated : Feb 5, 2020, 12:03 PM IST
ఇంట్రెస్టింగ్ మ్యాటర్ షేర్ చేసిన ఉపాసన 

టాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యామిలీలలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో ఉపాసన కొణిదెల ఒకరు. తరచుగా సామాజిక అంశాలపై అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు ఉపాసన. ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు, సూచనల్ని సైతం ఫాలోయర్లకు ఇస్తుంటారు. మెగా ఫ్యామిలీ కోడలిగా, రామ్ చరణ్ భార్యగా స్టార్ స్టేటస్ ఉన్నా.. సాధారణంగా ఉండటానికి ఇష్టపడతారు. ఉపాసన ఓ అసక్తికర విషయాన్ని తెలిపారు.

Also Read: ఏ అమ్మాయిని వేధించలేదు: కేసుపై స్పందించిన యాంకర్ ప్రదీప్

‘ఈరోజు చాలా అద్భుతమైన మహిళ నా వద్దకు వచ్చారు. నేనెవరో తెలుసా. మీ అమ్మకు డెలివరీ చేసి నిన్ను ఈలోకానికి తీసుకొచ్చింది నేనే అని డాక్టర్ సి. సర్ణకుమారి చెప్పారు. ఈ ప్రపంచంలోకి వచ్చిన నన్ను తొలిసారి చూసిన వ్యక్తిని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఎవరు, ఏ డాక్టర్ డెలివరీ చేశారో తెలుసా? చిన్న విషయాలే కానీ మనకు ఎంతో సంతోషాన్నిస్తాయని’ ఉపాసన ట్వీట్ చేశారు. డాక్టర్ స్వర్ణకుమారి ఫొటోను సైతం తన ఫాలోయర్లతో మెగా కోడలు ఉపాసన షేర్ చేసుకున్నారు. 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News