Virender Sehwag gives serious warning for CSK bowlers over extras: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 2023లో ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. మూడింటిలో గెలిచింది. బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగా ఉన్న చెన్నై భారీ స్కోర్స్ సాధిస్తోంది. అయితే బౌలింగ్‌లో మాత్రం బలహీనంగా ఉంది. బౌలర్లు ప్రతి మ్యాచ్‌లోనూ భారీగా రన్స్ ఇవ్వడం మాత్రమే కాదు.. అదనపు పరుగులు కూడా సమర్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై బౌలర్లకు భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ హెచ్చరిక చేశాడు.
ఐపీఎల్ 2023లో బౌలింగ్ విభాగంలో చెన్నై జట్టుకి గాయాల బెడద ఎక్కువగా ఉంది. స్టార్ ప్లేయర్స్ దీపక్ చహర్, బెన్ స్టోక్స్.. దేశీయ ఆటగాడు ముఖేశ్ చౌదరి గాయాలతో మ్యాచ్‌లకు దూరయ్యారు. దీంతో తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్, రాజ్యవర్ధన్ హంగార్గేకర్ వంటి అనుభవం లేని బౌలర్లతో నెట్టుకు రావాల్సి వస్తోంది. టాప్ బ్యాటర్లు ఉండడంతో ఒత్తిడికి గురై.. వైడ్లు, నోబాల్స్ ఎక్కువగా వేస్తున్నారు. దాంతో అదనపు పరుగులు రావడమే కాకుండా. . సమయం కూడా వృధా అవుతుంది.
అదనపు బంతుల కారణంగా చెన్నై స్లో ఓవర్ రేట్‌కు గురవుతుంది. ఇలానే ఎక్స్‌ట్రాలు ఇస్తే తాను కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ వార్నింగ్ ఇచ్చాడు. అయినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. సోమవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ చెన్నై బౌలర్లు ఏకంగా 12 అదనపు పరుగులిచ్చారు. ఇందులో లెగ్ బైలు 6, వైడ్లు 4, నో బాల్స్ 2 ఉన్నాయి. స్లో ఓవర్ రేట్ ఇలాగే కొనసాగితే ధోనీపై నిషేధం (MS Dhoni IPL Ban) విధించే పరిస్థితి వస్తుంది. ఇదే విషయాన్ని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. ఎక్స్‌ట్రాలు ఇవ్వడం తగ్గించకపోతే.. చెన్నైకి ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు.
'చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ అసలు సంతోషంగా కనిపించడం లేదు. బౌలర్లు వైడ్లు, నోబాల్స్ తగ్గించుకోవాలని చెప్పాడు. బెంగళూరుతోనూ ఒక ఓవర్ అదనంగా వేయాల్సి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే ధోనీపై నిషేధం పడుతుంది. కెప్టెన్ లేకుండా చెన్నై బరిలోకి దిగాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇక మోకాలి గాయం కారణంగా ధోనీ మరికొన్ని మ్యాచ్‌లే ఆడే అవకాశం కనిపిస్తోంది. మహీ ఎప్పుడూ పూర్తి సామర్థ్యంతో ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. అయితే బౌలర్లు ఇలాగే వైడ్లు, నోబాల్స్ వేస్తే మాత్రం ధోనీ విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది' అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు.
Also Read: Vamika Kohli Dating: వామికాను డేట్‌కి తీసుకెళ్లవచ్చా.. విరాట్ కోహ్లీని కోరిన బుడ్డోడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.