Royal Challengers Bangalore Won by 7 Runs: రాజస్థాన్ రాయల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విజయం సాధించింది. ఉత్కంఠభరిత పోరులో 7 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. డుప్లెసిస్ (62), మ్యాక్స్‌వెల్ (77) మెరుపులు మెరిపించారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 రన్స్ మాత్రమే చేసింది. హర్షల్ పటేల్ సూపర్ బౌలింగ్‌తో రాజస్థాన్ జోరుకు బ్రేక్ వేశాడు. ఆర్‌సీబీకి ఈ సీజన్‌లో నాలుగో విజయం కాగా.. రాజస్థాన్‌కు మూడో ఓటమి. పాయింట్ల పట్టికలో బెంగుళూరు ఐదోస్థానానికి చేరుకోగా.. రాజస్థాన్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
బెంగుళూరు విధించిన 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జోస్ బట్లర్‌ను సిరాజ్ డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి దేవ్‌దత్ పడిక్కల్ జట్టును ఆదుకున్నాడు. ఇద్దరు కలిసి పవర్ ప్లే ముగిసే సమయానికి 6 ఓవర్లలో 47 పరుగులు జోడించారు. ఆ తరువాత మరింత దూకుడు పెంచడంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ 92 పరుగులకు చేరింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్ (52)ను విల్లీ ఔట్ చేయడంతో మ్యాచ్ ములుపు తిరిగింది.
కాసేపటికే జైస్వాల్ (47)ను హర్షల్ పటేల్ ఔట్ చేయడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. 22 పరుగులు చేసిన కెప్టెప్ సంజూ శాంసన్ కూడా కీలక సమయంలో ఔట్ అయ్యాడు. హిట్‌మేయర్ రనౌట్ అయ్యాడు. అయితే ధ్రువ్ జురెల్ చెలరేగడంతో రాజస్థాన్‌కు విజయంపై ఆశలు చిగురించాయి. 16 బంతుల్లో 34 పరుగులతో అజేయంగా నిలవగా.. బెంగుళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రాజస్థాన్‌ను 182 రన్స్‌కే పరిమితం చేశారు. హర్షల్ పటేల్ మూడు వికెట్లు, సిరాజ్, విల్లీ తలో వికెట్ తీశారు.
Also Read: RCB Vs RR Match Updates: విరాట్ కోహ్లీకి కలిసిరాని గ్రీన్ జెర్సీ.. రెండోసారి గోల్డెన్ డక్
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరుకు మొదటి బంతికే షాక్ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీని ట్రెంట్ బౌల్ట్ డకౌట్ చేశాడు. డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ సూపర్ బ్యాటింగ్‌తో బెంగుళూరును ఆదుకున్నారు. దీంతో 20 ఓవర్లలో రాజస్థాన్ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు మ్యాక్స్‌వెల్‌కు దక్కింది.
Also Read: IPL 2023 Updates: కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్ ఇదేం బ్యాటింగ్ భయ్యా..! స్ట్రైక్ రేట్ ఏది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి