8th Pay Commission Latest Update: ప్రస్తుతం ఓల్డ్ పెన్షన్ విధానం అమలు కోసం పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతూ ప్రకటన చేయగా.. త్వరలో మరో భారీ ప్రకటన ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘాన్ని అమలు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 8వ వేతన సంఘానికి ఈ ఏడాదే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతన సంఘం నిబంధనలు మారుతూ ఉంటాయి. 5వ, 6వ, 7వ పే కమిషన్ల అమలులో ఇలానే జరిగింది. 7వ వేతన సంఘం 2013లో ఏర్పడి.. 2016లో అమల్లోకి వచ్చింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం భారీగా పెరిగింది. అంటే ఈ లెక్కన 8వ వేతన సంఘంపై కేంద్రం ఈ ఏడాది ప్రకటన చేస్తే.. 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలోనే 8వ వేతన సంఘం అమలు ప్రణాళికకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అలాంటి ప్రకటనేమీ చేయలేదు. ఇప్పుడు తాజా నివేదికలు 8వ వేతన సంఘంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో మళ్లీ ఆశలు రేకెత్తిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకునేందుకు 8వ వేతన సంఘం రూపంలో భారీ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉద్యోగుల బేసిక్ శాలరీ రూ.18 వేల నుంచి రూ.56,900 వరకు ఉంది. కొత్త పే కమిషన్ అమల్లోకి వస్తే.. ఉద్యోగుల జీతం ఒకేసారి భారీగా పెరగనుంది. 8వ వేతన సంఘం అమలు కోసం ఉద్యోగ సంఘ నేతలు త్వరలో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడనున్నారు. తమ డిమాండ్లతో ప్రభుత్వానికి మెమోరాండం కూడా సమర్పించనున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించకపోతే ఆందోళనకు దిగే యోచనలో ఉన్నారు.
అదేవిధంగా మరో ప్రచారం కూడా గతంలో తెరపైకి వచ్చింది. 7వ వేతన సంఘం తర్వాత కొత్త పే కమిషన్ రాదని కొందరు వాదిస్తున్నారు. 8వ వేతన సంఘం అమలుకు బదులుగా.. ప్రభుత్వం అదే బెనిఫిట్స్‌తో కొత్త విధానాన్ని అమలు చేయబోతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఆటోమేటిక్‌గా పెరుగుతుందని చెబుతున్నా. ఇది 'ఆటోమేటిక్ పే రివిజన్ సిస్టమ్' కావచ్చని అంటున్నారు. ఈ విధానంలో డీఏ 50 శాతం కంటే ఎక్కువ ఉంటే.. జీతంలో ఆటోమేటిక్ రివిజన్ ఉంటుందంటున్నారు. చూడాలి మరీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..!
Also Read: Man Attack On Student: ఇంటర్ తప్పి ఏడుస్తుంటే.. దొంగతనం పేరుతో నగ్నంగా చితక్కొట్టారు
Also Read: IPL Controversies: ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద వివాదాలు ఇవే.. ఎన్నటికీ మరువని ఘటనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook