Indigo Deal: ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద డీల్, 5 వందల విమానాల కొనుగోలుకు ఇండిగో ఆర్డర్

Indigo Deal: భారత విమానయాన రంగంలో అతిపెద్ద సంచలనమిది. విమానయాన చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం జరిగింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ చేసుకున్న ఒప్పందం భారత విమానయానంలో పెనుమార్పుకు కారణం కావచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 19, 2023, 11:02 PM IST
Indigo Deal: ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద డీల్, 5 వందల విమానాల కొనుగోలుకు ఇండిగో ఆర్డర్

Indigo Deal: ఓ వైపు విమానయాన సంస్థలు నష్టాలతో చేతులెత్తేస్తుంటే మరోవైపు ఇండిగో ఎయిర్‌లైన్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఎయిర్‌బస్ సంస్థతో అత్యంత ఖరీదైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం పలు సంచలనాలు నమోదు చేసింది. 

భారత విమానయాన రంగంలో ఇవాళ్టి రోజు కీలకంగా మారింది. పారిస్‌కు చెందిన ఎయిర్‌బస్ సంస్థతో ఇండిగో ఎయిర్‌లైన్స్ భారీ ఒప్పందం చేసుకోవడమే ఇందుకు కారణం. ఏకంగా 500 ఏ 320 విమానాల కొనుగోలుకు ఎయిర్‌బస్ సంస్థతో జరిగిన ఒప్పందమిది. ఈ మేరకు ఇండిగో ఎయిర్‌లైన్స్ 5 వందల ఏ320 విమానాలు కావాలని ఆర్డర్ పెట్టింది. ఓ వైపు విమానయాన రంగంలో నష్టాల్ని తట్టుకోలేక కొన్ని సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. అదే సమయంలో ఇండిగో సంస్థ ఇంత భారీ ఆర్డర్ ఎలా పెట్టిందనేది ఆశ్చర్యం కల్గిస్తోంది. 

ఇవాళ జరిగిన పారిస్ ఎయిర్ షో కార్యక్రమంలో ఈ ఒప్పందం జరిగింది. ఇందులో ఇండిగో బోర్డ్ ఛైర్మన్ వి సుమంత్రన్, ఇండిగో సీఈవో ఎల్బర్స్, ఎయిర్‌బస్ సీఈవో గుయిలౌమ్ ఫౌరీ, ఎయిర్‌బస్ ఛీఫ్ కమర్షియస్ ఆఫీసర్, ఇంటర్నేషనల్ హెడ్  పాల్గొని ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇండిగో సంస్థ తాజా ఆర్డరులో ఆ సంస్థ మొత్తం ఎయిర్‌బస్ విమానాల సంఖ్య 1330కు చేరింది. గతంలో ఎయిర్ ఇండియా ఏకంగా 470 ఏ 320 విమానాల కొనుగోలుతో రికార్డు సాధించింది. ఇప్పుడు ఇండిగో 5 వందల ఏ 320 విమానాల కొనుగోలు ఆర్డర్‌తో ఆ రికార్డు బ్రేక్ చేసింది. ప్రపంచంలో ఏ 320 విమానాలను భారీ సంఖ్యలో ఆర్డర్ ఇచ్చిన ఏకైక కంపెనీగా ఇండిగో ఎయిర్‌లైన్స్ నిలిచింది.

అంతేకాకుండా అటు ఎయిర్‌బస్ సంస్థకు కూడా ఇదే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ డీల్ అని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఆ సంస్థకు ఇంత పెద్ద డీల్ చేతికి చిక్కలేదు. ఇప్పుడు ఇండిగో పెట్టిన ఆర్డర్‌లో ఏ 320 నియో, ఏ 321 నియో, ఏ 321 ఎక్స్‌ఎల్ఆర్ ఉన్నాయి. ఇవాళ ఎయిర్‌బస్ సంస్థతో ఇండిగో ఎయిర్ లైన్స్ చేసుకున్న ఒప్పంద విలువ 50 మిలియన్ డాలర్లు ఉండవచ్చని తెలుస్తోంది. దేశీయ విమానయాన రంగంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ వాటా 56 శాతముంది.

Also read: Maruti Brezza: దేశంలో మారుతి సుజుకినే టాప్, అత్యధికంగా విక్రయమౌతున్న ఎస్‌యూవీ, ధర ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News