Sonia Gandhi's Dance video: జులై 8న రాహుల్ గాంధీ హరియాణాలో పర్యటించారు. ఆ సందర్భంగా గ్రామాల్లో రైతులతో మహిళ సంఘాలతో ఇంకా ఎంతో మందిని రాహుల్ గాంధీ కలిసి ముచ్చటించారు. ఆ సమయంలోనే మహిళ రైతులు కొందరు ఢిల్లీలోని మీ ఇంటిని ఒక సారి చూడాలని ఉందంటూ మాటల మధ్యలో రాహుల్ గాంధీని కోరడం జరిగింది.
అప్పుడే తనకు ఢిల్లీ లో ఇల్లు లేదని.. తన ఇంటిని ప్రభుత్వం లాక్కుందని కానీ తన అమ్మ సోనియా గాంధీ ఇల్లు ఉంది. ఆమె ఇంటికి మిమ్ములను ఆహ్వానిస్తున్నాను అన్నట్లుగా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలుపుకున్నారు. హరియాణా మహిళ రైతులు కొందరు పిల్లలను రాహుల్ గాంధీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి సోనియా గాంధీ ఇంటికి తీసుకు వెళ్లారు.
హరియాణా మహిళ రైతులకు సోనియా గాంధీ తన కూతురు ప్రియాంక గాంధీ.. కొడుకు రాహుల్ గాంధీతో కలిసి సాదరంగా స్వాగతం పలికారు. వారితో చాలా సమయం పాటు ముచ్చట్లు పెట్టడం మాత్రమే కాకుండా వారితో భోజనం చేసి.. ఆ తర్వాత కొద్ది సమయం డాన్స్ కూడా చేశారు. సోనియా గాంధీ మహిళ రైతులతో చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకున్న తర్వాత సోనియా గాంధీ ఎక్కువగా మీడియాలో కనిపించడం లేదు. తాజాగా మహిళ రైతులతో ఇలా డాన్స్ చేస్తూ.. వారితో సరదాగా గడిపిన మధుర క్షణాలను కాంగ్రెస్ పార్టీకి చెందని సోషల్ మీడియా వింగ్ షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెగ షేర్ చేస్తున్నారు. పూర్తి వీడియోను త్వరలో తీసుకు రాబోతున్నట్లుగా పేర్కొన్నారు.
Women farmers from Haryana had expressed their desire to @RahulGandhi to see Delhi and his house. He told them that the Govt has taken away his house.
But just see what happened next.
This video is pure joy! ❤️ pic.twitter.com/1cqAeSW5xg
— Ruchira Chaturvedi (@RuchiraC) July 16, 2023
Also Read: Team India: బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి రెడీ.. ఆ బౌలర్ మాత్రం ఎప్పుడంటే..!
సోనియా గాంధీ ఈ వయసులో కూడా మహిళ రైతులతో చాలా యాక్టివ్ గా సరదాగా గడిపారు. వారు కూడా సోనియా గాంధీ.. రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీని చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. సదరు మహిళ రైతులను కేవలం సోనియా గాంధీ ఇంటికి తీసుకు వచ్చి.. తీసుకు వెళ్లాం అన్నట్లుగా కాకుండా ఇండియా గేట్ తో పాటు ఢిల్లలోని పలు ప్రాంతాల్లో తిప్పారు. ఆ వీడియోను కూడా తాజా వీడియోలో షేర్ చేయడం జరిగింది.
ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో కాంగ్రెస్ నాయకులు డౌన్ టు ఎర్త్ అనే విషయాన్ని తెలియజేస్తుందని కొందరు ఆ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ తన మాటను నిలుపుకుని మహిళ రైతుల కోరికను తీర్చడం మాత్రమే కాకుండా ఎంతో మంది నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.
Also Read: NDA Meeting: ఢిల్లీ నుంచి పిలుపు, ఈ నెల 17న వెళ్లనున్న పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి