Viral Video: సినిమా స్టైల్ జరిగిన ఓ వ్యాపారి హత్యకు సంబంధించిన కేసులో ఎవరు ఊహించని, నమ్మలేని నిజాలు బయట పడ్డాయి. ఆ వ్యాపారి ఎంతో కష్టపడి చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇంతలోనే తన కారులోనే శవమై కనిపించడంతో అందరికి అశ్చర్యం కలిగింది. చివరి పోలీసులు కూడా ఎంతో అనుమానంతో దర్యాప్తు చేయడగా ఆశ్చరపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఆ యువ వ్యాపారి సహజంగా మరణించలేదని హత్యేనని చివరికి పోలీసుల దర్యాప్తులతో తెలింది. ఇంతకు ముందు ఉన్న ప్రియురాలే అతడిని పాముతో చంపినట్లు తేలింది.
ఈ ఘటన నైనిటాల్‌లోని హల్ద్వానీ జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే అంకిత్ చౌహాన్ అనే వ్యాపారి తన కారులోనే విగత జీవిగా కనిపించాడు. ఈ కేసుపై పూర్తిగా దర్యాప్తు చేపట్టిన తర్వాత అంకిత్ ప్రియురాలు తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో నేపాల్‌కి హనీమూన్‌కి వెళ్లినట్లు ఎంక్వైరీలో పోలీసులు తెలిపారు. జూలై 15న రాంబాగ్ కాలనీలో కారు ఆగి ఉండడం గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడి చేరుకుని కారుని పరిశీలించగా వెనుక సీటులో మృతదేహం లభ్యమైంది. కారులో ఉండే కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ అతిగా పీల్చడం వల్లే మరణించారిని అందరూ అనుకున్నారు. కానీ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అసలు నిజాలు ఏంటో తెలిసాయి. అంకిత్ సహజంగా మరణించలేదని తన రెండు కాళ్లకు కింగ్ కోబ్రా పాము కాటేయడం వల్ల చనిపోయాడని నివేదికలో వెల్లడించారు.
Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్
అంకిత్ మరణంపై పోలీసులు ప్రత్యేక బృందాలతో విచారణ చేశారు. ఈ విచారణలో భాగంగా ఆశ్చర్యపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు విచారణలో భాగంగా ఫోన్ రికార్డులు, సీసీటీవీలను పరిశీలించారు. అయితే ఇందులో భాగంగా మాజీ ప్రియురాలే హత్యకు ప్లాన్ వేసినట్లు తెలడంతో పోలీసులు ఒక్కసారిగా ఆశర్చానికి గురయ్యారు. అయితే అంకిత్, మహి గత కొన్ని సంవత్సరాల నుంచి డేటింగ్‌లో ఉన్నారని, ఇటీవలే చిన్న చిన్న గొడవల కారణంగా విడిపోయారని తేలింది. అంతేకాకుండా మహి ఆర్య, దీప్‌కాంత్ పాల్ అనే యువకుడితో లవ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పోస్ట్ మార్టంలో తేలిన నివేదిక ఆదారంగా ఫోన్‌లో వివరాలు మళ్లీ పరిశీలించారు. మహీ ఫోన్ మాట్లాడిన కాల్ రికార్డ్ ఆధారంగా పామును కాటు వేయించేందుకు రమేశ్‌నాథ్ అనే వ్యక్తితో చాలా సార్లు ఫోన్ మాట్లాడినట్లు తేలింది. అయితే పోలీసులు రమేశ్‌ను విచారించగా ఆర్యను కోబ్రాతో కరిపించమని రూ.10,000లు మహి ఇచ్చిందని తెలిపారు. అయితే అన్ని విషయాలు పోలీసులకు తెలియక ముందే మహీ తన కొత్త ప్రియుడితో నేపాల్‌కి వెళ్లిందని పోలీసులు తెలిపారు.
Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook