Viral News: ఇదేం ఆచారం రా బాబు..అతిథులకు కట్టెలతో స్వాగతం పలకడం ఏంటీ?

Viral News: బీహార్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో వింత ఆచారం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. అక్కడి ప్రజలంతా అతిథులను కర్రలతో ఆహ్వానించడం చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదేం ఆచారం రా బాబు అంటున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 23, 2023, 09:13 AM IST
 Viral News: ఇదేం ఆచారం రా బాబు..అతిథులకు కట్టెలతో స్వాగతం పలకడం ఏంటీ?

 

Viral News: హిందూ సంప్రదాయంలో అతిథులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అతిథులను ఇంటికి పిలిచినప్పుడు ఎంతో ప్రేమతో మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఇక పల్లె ప్రాంతాల్లోనైతే కాళ్లకు నీళ్ళు ఇచ్చి మరి స్వాగతించడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఇలా ఒక్కొక్కరు వారికి నచ్చినట్టు అతిధులను ఆహ్వానిస్తారు. అయితే ఓ గ్రామంలో వింత ఆచారంలో భాగంగా వారి స్టైల్ లో అతిథులను ఆహ్వానిస్తారు. ఈ విచిత్రమైన ఆహ్వానాన్ని చూస్తే మీరు షాక్ అవుతారు. ఇంతకీ వింత ఆచారం ఎక్కడుందో అని తెలుసుకోవాలనుకుంటున్నారా..?

ఆ గ్రామంలో అందరూ ఇంటికి వచ్చిన అతిథులను ఎంతో కోపంతో కర్రలతో ఆహ్వానించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుందట. ఆ గ్రామంలో వారంతా చేతిలో కర్రలను పట్టుకుని ఇంటి దర్వాజా ముందు నిలబడి కర్రలతో ఆహ్వానిస్తారు. అంతేకాకుండా వారు కర్ర లేకుండా అసలు బయటికే వెళ్లలేరని స్థానికులు చెబుతున్నారు. వింత ఆచారం బీహార్ లోని జముయి జిల్లాలో ఇప్పటికే ఉంది. సాధారణంగా అతిథులను ఆహ్వానించినప్పుడు ఎంతో ప్రేమతో ఆలింగనం చేసుకుని ఇంట్లోకి పిలుస్తారు కానీ వారంతా కట్టెలు పట్టుకుని ఆహ్వానించడంతో తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. 

Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు

అయితే అసలు విషయం ఏంటంటే వీధి కుక్కల దాడిలో ఆ ఊరి ప్రజలు ఇప్పటికీ చాలామంది చనిపోయారని.. వారిని వారు రక్షించుకునేందుకు కట్టెలు పట్టుకొని బయటకు వెళ్తారని సమాచారం. అంతేకాకుండా ఈ గ్రామంలో సింహాలు కూడా సంచారం చేస్తాయట అయితే వీటి నుంచి కూడా రక్షణ పొందేందుకు వారు ఇలా కట్టెలు పట్టుకొని తిరుగుతూ ఉంటారంట. అందుకే తమ గ్రామంలోకి వచ్చే ఆఫీసర్లను, అతిధులను రక్షించేందుకే వారు కట్టెలు పట్టుకొని బయటకు వస్తారని సమాచారం.

అందరికీ సందేహం కలుగవచ్చు ఒక్కరు వెళితే కుక్కలు దాడి చేస్తే గుంపుగా కూడా వెళ్ళొచ్చని.. కానీ గుంపుగా వెళ్లే క్రమంలో కూడా కట్టెలు వెంటబెట్టుకొని వెళ్తారట. కొన్ని కొన్ని సందర్భాల్లో ఊర కుక్కలు గుంపు పై కూడా దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే కుక్కల బెడద నుంచి విముక్తి కలిగించమని స్థానికులు ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని.. అందుకే కర్రలు వెంటపెట్టుకొని వెళ్తున్నారని వారంటున్నారు. 

Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News