7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి రెండుసార్లు డీఏ పెరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి డీఏ పెంపు జనవరిలో, రెండో డీఏ పెంపు జూలై నెలలో ఉంటుంది. ఈ ఏడాది ఏడాది డీఏ పెంపు ప్రకటన మార్చిలో రాగా.. జనవరి నుంచి అమలు చేశారు. 4 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో 38 నుంచి 42 శాతానికి చేరింది. ప్రస్తుతం రెండో డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వస్తుందా..? అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎంత పెంపు ఉంటోందనని ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి వర్తించనుంది.
ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ ప్రకటన సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. డీఏ పెంపు ఎంత పెరుగనుందో మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. జూలై నెలకు సంబంధించి ఏఐసీపీఐ సూచికను కార్మిక మంత్రిత్వ శాఖ ఆగస్టు 31న విడుదల చేస్తుంది. డీఏ 45 శాతానికి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇండెక్స్ డేటా ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్ పెంపును నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే. జనవరి నుంచి జూన్ వరకు ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా.. డీఏ పెంపు 3 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంది. అయితే ప్రభుత్వం దశాంశాన్ని పరిగణనలోకి తీసుకోదు. దీంతో ఈసారి డీఏ 3 శాతం పెరిగి 42 నుంచి 45 శాతానికి పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు మాత్రం 4 శాతం డీఏ పెంచాలని డిమాండ్చేస్తున్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ పే కమీషన్ కింద జీతాలు చెల్లింస్తున్నారు. డీఏ పెంపుతోపాటు హెచ్‌ఆర్‌ఏలో పెరుగుదల ఉంటుంది. అయితే డీఏ 50 శాతం దాటితే.. హెచ్ఆర్‌ఏలో పెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం హెచ్‌ఆర్‌ఏను ఆయా నగరాల ఆధారంగా చెల్లిస్తోంది కేంద్ర ప్రభుత్వం. వీటికి X, Y, Z క్యాటగిరీలుగా విభజించారు. X నగరంలో నివసిస్తున్న కేంద్ర ఉద్యోగులు ఎక్కువ హెచ్‌ఆర్‌ఏను పొందుతారు. Y, Z నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులకు తక్కువ హెచ్‌ఆర్ఏ అందుతుంది. నగరాన్ని బట్టి 27 శాతం, 18 శాతం, 9 శాతం హెచ్‌ఆర్‌ఏను పొందుతారు.
Also Read: Minister Roja: రజనీకాంత్ స్టైల్లో మంత్రి రోజా డైలాగ్.. పవన్, చంద్రబాబుకు కౌంటర్.. అర్థమైందా రాజా..!
Also Read: Asia Cup 2023: సచిన్ రికార్డుపై రోహిత్ శర్మ కన్ను.. టాప్ ప్లేస్‌కు చేరవలో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook