Hyderabad - Bengaluru Vandebharat Train: తెలంగాణకు మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఈ రైలు ప్రత్యేకతలు ఏంటంటే..

Hyderabad - Bengaluru Vandebharat Express Train: హైదరాబాద్ : 24 తేదీన దేశవ్యాప్తంగా కొత్తగా మరో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది.

Written by - Pavan | Last Updated : Sep 23, 2023, 06:12 AM IST
Hyderabad - Bengaluru Vandebharat Train: తెలంగాణకు మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఈ రైలు ప్రత్యేకతలు ఏంటంటే..

Hyderabad - Bengaluru Vandebharat Express Train: హైదరాబాద్ : 24 తేదీన దేశవ్యాప్తంగా కొత్తగా మరో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా.. తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును కేంద్రం ప్రారంభించబోతోంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా.. సికింద్రాబాద్ - విశాఖపట్టణం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అందించిన కేంద్రం.. ఆ తరువాత ఉగాది ఉందర్భంగా సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వినాయక నవరాత్రుల కానుకగా కాచిగూడ - బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

ఈ నెల 24 నుండి కాచిగూడ స్టేషన్ నుండి హైదరాబాద్ - బెంగళూరు (యశ్వంతపూర్) మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపైకి ఎక్కనుంది. మొదటిరోజు ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడలో ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో నేరుగా పాల్గొంటారు.

ఇకపై ప్రతీవారంలో ఒక్క బుధవారం మినహాయించి వారంలో ఆరు రోజులు కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు రైలు బయలుదేరుతుంది. మహబూబ్‌నగర్ (6.59), కర్నూల్ సిటీ (8.39), అనంతపూర్ (10.54) స్టేషన్లలో ఆగుతూ మధ్యాహ్నం 2.15 గంటలకు బెంగళూరులోని యశ్వంత్‌పూర్ కి చేరుకుంటుంది.

మధ్యాహ్నం 3 గంటలకు యశ్వంత్‌పూర్‌ నుంచి బయలుదేరి, సాయంత్రం 5.40 గంటలకు అనంతపురంలో, రాత్రి 7.50 గంటలకు కర్నూల్ సిటీలో, రాత్రి 9.39 గంటలకు మహబూబ్‌నగర్ స్టేషన్ లో ఆగుతూ రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

ఆదివారం ఒక్కరోజు మాత్రం.. మధ్యాహ్నం 12.30 గంటలకి కాచిగూడ నుంచి బయలుదేరి ఫలక్‌నుమా, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, పెండేకల్లు జంక్షన్, గుత్తి, కల్లూరు, అనంతపూర్, ధర్మవరం జంక్షన్, పెనుగొండ, రంగేపల్లి, హిందూపూర్, తొండెబావి, యలహంక జంక్షన్, లొట్టేగొల్లహల్లి మీదుగా యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. 

మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు:
ఇది తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలను.. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, నంద్యాల్, అనంతపూర్, శ్రీ సత్యసాయి జిల్లాలను..  కర్ణాటక లోని చిక్‌బళ్లాపూర్, బెంగళూరు రూరల్ జిల్లాలను.. ఇలా మొత్తం 12 జిల్లాలలను కవర్ చేస్తూ వెళ్తుంది.
హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సగటు వేగం గంటకు 71.74 కిలోమీటర్లుగా ఉంది.
గతంలో ఈ దూరం ప్రయాణించేందుకు పట్టే సమయం 11.20 గంటలు కాగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు రాకతో 8.30 గంటల్లో ప్రయాణికులు తమ గమ్యస్థానం చేరుకోవచ్చు.
ఈ మార్గంలో వచ్చే 4 ప్రధాన స్టేషన్లు కాచిగూడ (హైదరాబాద్), కర్నూల్, అనంతపూర్, యశ్వంత్‌పూర్ (బెంగళూరు).
ఈ మార్గంలో ఉన్నటువంటి  ప్రముఖ పర్యాటక కేంద్రాలు.. సమతామూర్తి (స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ), గోల్గొండ కోట, చార్మినార్, గద్వాల్ కోట, శ్రీశైలం (కర్నూలు సమీపంలో) సత్యసాయి ప్రశాంతి నిలయం (అనంతపూర్), బెంగళూరులోని పర్యాటక కేంద్రాలు
దేశ ఐటీ రాజధాని, స్టార్టప్ రాజధానిని ఈ రైలు అనుసంధానం చేస్తుంది.

Trending News