Revanth Reddy Fires On KTR and Harish Rao: 4 కోట్ల తెలంగాణ ప్రజలతోపాటు సోనియా గాంధీని సీఎం కేసీఆర్ మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సంక్షేమ పథకాలు అందుతాయని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయం.. ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టడం అని జోస్యం చెప్పారు. మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కుమారుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి గురువారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాండూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కూడా హస్తం గూటికి చేరిపోయారు.
రాష్ట్రాన్ని కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారని.. కాంగ్రెస్ ఏం చేసిందంటూ బిల్లా రంగాలు చిత్తకార్తె కుక్కల్లా తిరుగుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. బిల్లా రంగాలు అంటే కేటీఆర్.. హరీష్ రావు అని చెప్పారు. కేసీఆర్ సీఎం అయినా.. కేటీఆర్ మంత్రి అయినా సోనియా గాంధీ పెట్టిన భిక్షని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్, రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీఎయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి స్కీమ్స్‌ను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా అని ప్రశ్నించారు.
తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. రబ్బరు చెప్పులతో తిరిగిన హరీష్ రావు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. తమ పార్టీ కార్యకర్తలపై ఇన్నాళ్లు కేసులు పెట్టారని.. మరో 45 రోజుల్లో తమ కార్యకర్తలకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. అందరూ అధికారుల సంగతి తేల్చుతామని స్పష్టం చేశారు. అధికారులకు వడ్డీతో సహా ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర డీజీపీని తొలగించాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తున్నవారిని బెదిరిస్తే ఊరుకునేది లేదన్నారు.
తమ పార్టీకి సాయం చేస్తున్న 75 మంది లిస్టును కేటీఆర్ తయారు చేశారని.. ఆ లిస్టును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ కొంతమందిని బెదిరిస్తున్నారని.. మరో 45 రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. మిత్తతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించవద్దని హితవు పలికారు. కార్యకర్తలు, నాయకులు మరో 45 రోజులు అకుంఠిత దీక్ష చేస్తే అధికారం మనేదనని ధైర్యం చెప్పారు.
Also Read: Minor Sisters Killed: ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అక్క.. చెల్లెళ్లు చూశారని దారుణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి