SL Vs BAN Highlights: బంగ్లా కెప్టెన్ షకీబుల్ హాసన్ ఆల్‌రౌండ్ షో.. బంగ్లా చేతిలో శ్రీలంక ఓటమి

Sri Lanka Vs Bangladesh World Cup 2023: బంగ్లాదేశ్‌లో చేతిలో శ్రీలంక ఓటమిపాలైంది. 7 వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లా.. వరల్డ్ కప్ చరిత్రలో శ్రీలంకపై బంగ్లాకు ఇదే తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బంగ్లా కెప్టెన్ షకీబుల్ హాసన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. 

Written by - Ashok Krindinti | Last Updated : Nov 7, 2023, 12:01 AM IST
SL Vs BAN Highlights: బంగ్లా కెప్టెన్ షకీబుల్ హాసన్ ఆల్‌రౌండ్ షో.. బంగ్లా చేతిలో శ్రీలంక ఓటమి

Sri Lanka Vs Bangladesh World Cup 2023: వరుసగా ఆరు ఓటముల తరువాత బంగ్లాదేశ్‌ వరల్డ్ కప్‌లో గెలుపొందింది. న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్‌ అయింది. అసలంక (108) సెంచరీతో చెలరేగాడు. అనంతరం బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నజ్మూల్ శాంటో (90), కెప్టెన్ షకీబుల్ హాసన్ (82) లక్ష్య ఛేదనలో కీలక పాత్రపోషించారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ పాయింట్ల ఏడోస్థానంలోకి రాగా.. శ్రీలంక 8వ స్థానానికి పడిపోయింది. టాప్-8లో నిలిచిన జట్లు నేరుగా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడనున్న విషయం తెలిసిందే. కాగా.. వరల్డ్ కప్ చరిత్రలో శ్రీలంకపై బంగ్లాకు ఇదే తొలి విజయం కావడం విశేషం.

శ్రీలంక విధించిన 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలో తడపడింది. ఓపెనర్లు హసన్ (9), లిట్టన్ దాస్ (23) తక్కువ స్కోరుకే ఔట్ అయ్యారు. నజ్మూల్ శాంటో, కెప్టెన్ షకీబుల్ హాసన్ జట్టును ఆదుకున్నారు. శ్రీలంక బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జట్టును ఒడ్డుకు చేర్చారు.  31 ఓవర్లలో జట్టు స్కోరు 210 పరుగులకు చేరుకోగా.. షకీబుల్ హాసన్ (65 బంతుల్లో 82, 12 ఫోర్లు, 2 సిక్సర్లు)ను మ్యాథ్యూస్ ఔట్ చేసి భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు. 

తన తరువాతి ఓవర్‌లోనే నజ్మూల్ శాంటో (101 బంతుల్లో 90, 12 ఫోర్లు)ను పెవిలియన్‌కు పంపించాడు. అప్పటికే బంగ్లా విజయం ఖరారు అయినా.. మహ్మదుల్లా (22), ముష్పఖీర్ రహీమ్ (10) ఔట్ అవ్వడంతో బంగ్లా శిబిరంలో కాస్త ఆందోళన నెలకొంది. అయితే చివరి వరుసగా బ్యాట్స్‌మెన్లు శ్రీలంకకు అవకాశం ఇవ్వకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన 50 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్‌ అయింది. అసలంక (105 బంతుల్లో 108, 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ బాదగా.. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (41), సమరవిక్రమ (41), డిసిల్వా (34) రాణించారు. బంగ్లా బౌలర్లలో హాసన్ షకీబ్ 3 వికెట్లు తీయగా.. ఇస్లామ్, షకీబుల్ హాసన్ చెరో రెండు వికెట్లు పడొట్టారు. బ్యాటింగ్.. బౌలింగ్‌లో అదరగొట్టిన బంగ్లా కెప్టెన్ షకీబుల్ హాసన్‌కు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…

Also Read: Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే జైలు నుంచే పాలన సాగిస్తారా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News