World Cup 2023: ప్రపంచకప్ 2023 నాకౌట్ దశకు వచ్చేస్తోంది. ఇప్పటికే రెండు జట్లు సెమీస్ చేరగా మిగిలిన రెండు సెమీఫైనల్స్ స్థానాల కోసం న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు పోటీ పడనున్నాయి. సెమీస్‌లో భారత్ వర్సెస్ పాక్ తలపడే అవకాశాలున్నాయో లేవా అనేది పరిశీలిద్దాం. ఎందుకంటే క్రికెట్ ప్రేమికులకు ఇంతకు మించిన హై వోల్టేజ్ మ్యాచ్ మరొకటి ఉండనే ఉండదు.
ప్రపంచకప్ 2023లో ఇండియా, దక్షిణాఫ్రికాలు సెమీస్‌కు చేరగా, ఏ మాత్రం అంచనాల్లేని ఆఫ్గనిస్తాన్ సెమీస్ రేసులోకి వచ్చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సెమీస్ రేసులోకి కూడా రాలేకపోయింది. శ్రీలంక కూడా కుదేలైపోయింది. ఆఫ్ఘనిస్తాన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సెమీస్ రేసులోకి వచ్చేస్తోంది. మూడవ సెమీస్ స్థానం దాదాపుగా ఆస్ట్రేలియాకు ఖాయం కావచ్చు. ఇక నాలుగవ సెమీస్ కోసం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ క్రమంలో క్రికెట్ ప్రేమికులకు హై వోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. అంటే సెమీఫైనల్స్‌లో భారత, పాకిస్తాన్ జట్లు తలపడటం. ఇది సాధ్యమేనా అసలు. సాధ్యం కావాలంటే ఏం జరగాలి..ఎలాంటి సమీకరణాలు మారాలో చూద్దాం.
పాయింట్ల పట్లికలో టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది కాబట్టి నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్ ఆడనుంది. నాలుగో స్థానం కోసం ప్రస్తుతం న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీ పడుతున్నాయి. ఇది జరగాలంటే శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాలి. పాకిస్తాన్ ఇంగ్లండ్‌పై గెలవాలి. అప్పుడు పాకిస్తాన్ పాయింట్లు 10కు చేరి, న్యూజిలాండ్ 8 పాయింట్ల వద్దే ఉండిపోతుంది. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో రెండూ ఓడిపోతే పాకిస్తాన్‌కు నాలుగో సెమీస్ చాలా సులభమౌతుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఒకటి గెలిచి ఒకటి ఓడితే రన్‌రేట్ ఆధారంగా పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశాలుంటాయి.
ఒకవేళ న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయి, ఇంగ్లండ్‌పై పాకిస్తాన్ విజయం సాధిస్తే న్యూజిలాండ్ 9 పాయింట్లు, పాకిస్తాన్ 10 పాయింట్లతో సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఆ తరువాత ఆఫ్గనిస్తాన్ రెండు మ్యాచ్‌లో ఒకటి గెలిచినా సెమీస్ బర్త్ కోసం ఈ రెండు జట్ల మధ్య మరో మ్యాచ్ ఉంటుంది.
ఈ సమీకరణాలు, సాధ్యాసాధ్యాలు సాధ్యమైతే కచ్చితంగా క్రికెట్ ప్రేమికులు ఎదురుచూసే హై వోల్టేజ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సెమీపైనల్స్ చూడవచ్చు. ఇప్పటి వరకూ ఈ ప్రపంచకప్‌లో చాలా అద్భుతాలే జరిగాయి. ఇంకెన్ని జరుగుతాయో చూద్దాం.
Also read: Angelo Mathews Timeout: షేక్ హ్యాండ్ లేదు.. ఏం లేదు దొబ్బేయండి.. బంగ్లాపై శ్రీలంక ప్లేయర్లు ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook