Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. నామినేషన్ల పర్వం ముగిసిపోవడంతో అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. తమనే గెలిపించాలంటూ ఓటర్లను కోరుతున్నారు. మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ చూస్తుండగా.. బీఆర్ఎస్‌ను ఓడించి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టి.. సత్తాచాటాలని బీజేపీ కూడా చూస్తోంది. సర్వేలు కూడా హోరాహోరీ పోరు తప్పదని తేల్చడంతో అధికారంలోకి ఎవరు వస్తారనేది ఉత్కంఠగా మారింది. ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. సీఎం అభ్యర్థి ఎవరు..? అనే విషయంతో సంబంధం లేకుండా.. అధికారమే లక్ష్యంగా పోరాడుతోంది. అయితే అధికారంలోకి వస్తే సీఎం పదవి కోసం పలువురు నేతలు రేసులో ఉన్నారు. ఎవరికి వారే తాము సీఎం అభ్యర్థులమంటూ ప్రకటించుకోవడం పార్టీలో చర్చగా మారింది.
కొండగల్ బిడ్డకు రాష్ట్రాన్ని పాలించే అవకాశం రానుందని రేవంత్ రెడ్డి చెప్పగా.. జలగం వెంగళరావు తర్వాత ఖమ్మం నుంచి మళ్లీ రాష్ట్రానికి సేవ చేసే అవకాశం తనకు రాబోతుందంటూ భట్టి విక్రమార్క.. సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి ఇలా అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాతే అధిష్టానం ఎవరు ఎంపిక చేస్తే.. వాళ్లే ముఖ్యమంత్రిగా ఉంటారు. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే.. 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి ఉంటారంటూ బీఆర్ఎస్ సెటైర్లు కూడా పేల్చుతోంది.
ఇక తాజాగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం మాచారెడ్డి మండలం రెడ్డిపేటలో జరిగిన రోడ్ షోలో రేవంత్ రెడ్డితో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే రాష్ట్రానికి కాబోయే సీఎం అని ప్రకటించేశారు. మీ షబ్బీర్ అలీ ఎక్కడికీ పోలేదని.. మీ గుండెల్లోనే ఉన్నాడంటూ ప్రజలను ఉద్దేశించి అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానం ఉంచి షబ్బీర్ అలీ బరిలో ఉన్నారు.
షబ్బీర్ అలీ చేసిన కామెంట్స్‌తో మిగిలిన నాయకులు ఏమంటారో చూడాలి. ప్రచారం హడావుడిలో లైట్ తీసుకునే అవకాశం ఉంది. ముందు అధికారంలోకి వస్తే.. పదవి విషయం అధిష్టానం చూసుకుంటుందనే అనుకుంటున్నారు. పార్టీ గెలుపు కోసం విభేదాలను పక్కనబెట్టి పనిచేస్తున్నారు.
Also Read: Ind vs Nz Semifinal: ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ ఆధిక్యం, ఇండియా వర్సెస్ కివీస్
Also Read: Srilanka Earthquake: శ్రీలంకలో భారీ భూకంపం, 6.2 తీవ్రతతో కొలంబోలో కంపించిన భూమి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి