Peanuts : మనం రోజు తినే ఈ పప్పుతో కూడా మధుమేహం తగ్గుతుందని తెలుసా??

Diabetes Control : డయాబెటిస్ తో బాధపడేవారు తీసుకోవలసిన ఆహారం గురించి పలు రకాల సందేహాలు ఉంటాయి. ఎటువంటి డైట్ తీసుకోవాలి ఎటువంటి డైట్ తీసుకోకూడదు అనే విషయంపై వాళ్లు ఎప్పుడూ సందేహిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో డయాబెటిస్ తో  బాధపడేవారు వేరుశనగపప్పు తినవచ్చా లేదా తెలుసుకుందాం పదండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2023, 11:00 PM IST
Peanuts : మనం రోజు తినే ఈ పప్పుతో కూడా మధుమేహం తగ్గుతుందని తెలుసా??

Diabetes Control: చట్నీ దగ్గరనుంచి తాలింపుల వరకు.. ఎక్కువగా మన వంటల్లో ఉపయోగించే పప్పు వేరుశనగపప్పు. ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా లభించే వేరుశనగపప్పును డయాబెటిస్ పేషెంట్స్ తినవచ్చా లేదా అని సందేహిస్తూ ఉంటారు. వేరుశనగపప్పు తినడం వల్ల శరీరానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి.. అవి ఎవరు తినవచ్చు.. ఎవరు తినకూడదు.. అనే విషయాల గురించి తెలుసుకుందాం.

వేరుశనగ పప్పులో కేలరీలు చాలా తక్కువ ఉండడంతో పాటు ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి వేరుశనగపప్పు మంచి ప్రోటీన్ ప్రత్యయమునాయం. అయితే చాలామంది ఈ విషయం తెలియక వేరుశనగ పప్పు తింటే లావు అవుతారు అని భావిస్తారు. వేరుశనగ పప్పు తినడం వల్ల పొట్ట నిండుగా అనిపించి చాలా సేపటి వరకు మరింకే ఆహారం తీసుకోము. 

వేరుశనగ పప్పులో యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పాటు విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజు ఒక గుప్పెడు వేరుశనగ పప్పులు తినడం అలవాటుగా చేసుకుంటే అనేక రకాల వ్యాధులను దూరంగా ఉంచవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అదేనాల ప్రకారం రోజు వేరుశనగ పప్పు తినేవారు ఎక్కువకాలం జీవిస్తారట. తినమన్నారు కదా అని నూనెలో వేసి వాటిని ఇంకొంచెం ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి తినకూడదు.

రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 10 నుంచి 15 వేరుసెనగ గింజలను నానబెట్టి వాటిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులో ఉన్న పౌష్టిక తత్వాలు మన శరీరానికి సరియైన మోతాదులో అందుతాయి. షుగర్ పేషెంట్స్ రోజు ఇలా చేయడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.  రోజు ఇలా నానబెట్టిన వేరుశనగ పప్పు తినడం వల్ల కాళ్లు, కీళ్లు ,నరాలకు సంబంధించిన ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. జీర్ణ వ్యవస్థ బలోపేతం అవడంతో పాటు ఉదర సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించబడినది. కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News