Machilipatnam MP Balashowry Resigns: ఏపీలో అభ్యర్థుల మార్పు అధికార పార్టీలో చిచ్చు పెడుతోంది. టికెట్ దక్కని నేతలు వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా మరో ఎంపీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రకటించారు. తనకు ప్రాధాన్యం దక్కట్లేదని ఆయన కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయనకు మచిలీపట్నం టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్ మోహన్ రెడ్డి పంపించినట్లు ఆయన తెలిపారు. తాను జనసేలో చేరుతున్నట్లు ప్రకటించారు. కాగా.. టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది.
ఎమ్మెల్మేలతో విభేదాల కారణంగానే బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ బాలశౌరిని అన్ని కార్యక్రమాలకు దూరం పెడుతున్నారు. గతంలో మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి పర్యటించగా.. పేర్ని నాని వర్గీయులు అడ్డుకోవడం రచ్చకు దారి తీసింది. అప్పట్లో పేర్ని నానికి బాలశౌరి బహిరంగంగానే సవాల్ విసిరారు. బందరులో పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని.. తనను మచిలీపట్నం రానీయకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక నుంచి బందరులో ఉంటానని.. ఎవరో ఏం చేస్తారో చూస్తానంటూ గట్టి హెచ్చరికే పంపించారు. అదేవిధంగా మంత్రి జోగి రమేష్‌తో కూడా బాలశౌరికి వర్గపోరు నడుస్తోంది.
ఈసారి మచిలీపట్నం ఎమ్మెల్యే టికెట్‌ను తన కుమారుడినికి ఇప్పించుకున్న పేర్ని నాని.. ఈసారి ఎంపీగా బరిలో దిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎంపీ టికెట్ కోసం ఇప్పటికే సీఎం జగన్‌కు రిక్వెస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. పేర్ని నాని ఎంపీగా బరిలో నిలిస్తే.. బాలశౌరితో హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంటుంది.
Also Read: January Bank Holidays List: బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook