Prabhas - Salaar: అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ప్రభాస్ 'సలార్' మూవీ..

Prabhas - Salaar:ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్'. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ గతేడాది చివర్లో విడుదలై సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 04:56 PM IST
Prabhas - Salaar: అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ప్రభాస్ 'సలార్' మూవీ..

Prabhas Salaar: ప్రభాస్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ మరో లీడ్ రోల్లో నటించిన సినిమా 'సలార్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాది చివర్లో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి టాక్‌తో బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. ఇక కన్నడ, ఇతర భాషల్లో పెద్దగా పర్ఫామె్ చేయలేదు. అటు హిందీలో కూడా అనుకున్నంత టాక్‌కు తగ్గ వసూళ్లు రాబట్టడంలో విఫలం అయింది. దీంతో ఈ సినిమా రూ. 700 కోట్ల వరకే పరిమితమైంది. ఇక సలార్ మూవీ నైజాం (తెలంగాణ) గడ్డపై రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది. గతంలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత మూడో సినిమాగా ఈ మూవీ రికార్డులకు ఎక్కింది. తెలుగులో సంక్రాంతి సినిమాల రాకతో ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగింపుకు వచ్చింది. మరోవైపు ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. హిందీ తప్ప ఈ సినిమా అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అక్కడ ఈ మూవీ తెలుగులో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. తెలుగు వెర్షన్ నెంబర్ 1 ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అటు తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌లు 2,5,7 స్థానాల్లో కొనసాగుతోంది.

మరోవైపు 'సలార్' మూవీ స్పానిష్ భాషలో డబ్ చేసిన మార్చి 7 లాటిన్ అమెరికా దేశాల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు 'సలార్' మూవీని జపాన్‌ దేశంలో సమ్మర్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ విషయానికొస్తే.. ఇద్దరు ప్రాణ స్నేహితులు..శత్రువులుగా ఎలా మారారనే కథాంశంతో తెరకెక్కింది. ఇక సలార్ రెండో పార్ట్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. రెండో పార్ట్‌కు సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనే టైటిల్ ఖరారు చేసారు మేకర్స్. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.

ప్రభాస్ ఇతర చిత్రాల విషయానికొస్తే.. ఈయన హీరోగా నటించిన 'కల్కి' మూవీ మే 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దీపికా హీరోయిన్‌గా నటిస్తోంది.  మరోవైపు ప్రభాస్ 'రాజా సాబ్' మూవీ చేస్తున్నారు.ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోమనన్‌, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ గా ఈ మూవీ రాబోతున్నటు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్ధమవుతోంది.  అటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మూవీలపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇంకోవైపు ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు.

Also Read: One Man Five Women Preganant: వీడు మగాడ్రా బుజ్జి.. 22 ఏళ్లకే ఐదుగురు భార్యలు, ఒకేసారి తల్లులు కాబోతున్నారు

Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News