Prabhas: ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆ విషయంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు నిరాశే..

Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్‌గా 'సలార్' మూవీతో పలకరించారు. ఈ మూవీతో పవర్‌పుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ప్రభాస్.. తన అభిమానులకు మరోసారి షాక్ ఇవ్వబోతున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2024, 09:10 AM IST
Prabhas: ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆ విషయంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు నిరాశే..

Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్'. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ గతేడాది చివర్లో విడుదలై సంచలన విజయం సాధించింది. అయితే గతేడాది విడుదలైన 'ఆదిపురుష్' .. ఆ తర్వాత విడుదలైన సలార్ సినిమాలు ముందుగా అనుకున్న తేదిల్లో విడుదల కాలేకపోయాయి. ఇక ఆదిపురుష్ విషయానికొస్తే..ఈ మూవీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అప్పటికే విడుదలైన ట్రైలర్ పేలవంగా ఉండటంతో ఈ మూవీని జూన్ కు వాయిదా వేసారు. కానీ ఓం రౌత్ ఈ సినిమాను తన ఇష్టారీతినా తెరకెక్కించడంతో ప్రేక్షకుల తిరస్కారినికీ గురైంది.

మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన సలార్ మూవీ కూడా ముందుగా సెప్టెంబర్ అంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. ఆ తర్వాత డిసెంబర్‌కు  వాయిదా వేసారు. ఇయర్ ఎండ్‌లో విడుదలైన ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే అందరు అనుకున్నట్టు రూ. వెయ్యి కోట్ల మార్క్‌ను రీచ్ కాలేకపోయింది. ఓవారాల్‌గా రూ. 700 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరో లీడ్ రోల్లో నటించారు.   ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాది చివర్లో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి టాక్‌తో బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. ఇక కన్నడ, ఇతర భాషల్లో పెద్దగా పర్ఫామ్‌ చేయలేదు. ఇక సలార్ మూవీ నైజాం (తెలంగాణ) గడ్డపై రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది. గతంలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత మూడో సినిమాగా ఈ మూవీ రికార్డులకు ఎక్కింది. తెలుగులో సంక్రాంతి సినిమాల రాకతో ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగింపుకు వచ్చింది. మరోవైపు ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అక్కడ ఈ మూవీ హిందీ సహా అన్ని భాషల్లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ ప్యాన్ వరల్డ్ మూవీ 'కల్కి 2898 AD'. ఈ మూవీని ముందుగా ఈ యేడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ మే 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీని దసరాకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయనేది సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి కావొచ్చింది.కానీ మెరుగులైన ఇంటర్నేషనల్ గ్రాఫిక్స్ కోసం ఈ మూవీ విడుదల తేదిని వాయిదా వేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దీపికా హీరోయిన్‌గా నటిస్తోంది.  మరోవైపు ప్రభాస్ 'రాజా సాబ్' మూవీ చేస్తున్నారు.

ఇక ప్రభాస్ నటించిన 'సలార్' మూవీని స్పానిష్ భాషలో డబ్ చేసిన మార్చి 7 లాటిన్ అమెరికా దేశాల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు 'సలార్' మూవీని జపాన్‌ దేశంలో సమ్మర్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ విషయానికొస్తే.. ఇద్దరు ప్రాణ స్నేహితులు..శత్రువులుగా ఎలా మారారనే కథాంశంతో తెరకెక్కింది. ఇక సలార్ రెండో పార్ట్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. రెండో పార్ట్‌కు సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనే టైటిల్ ఖరారు చేసారు మేకర్స్. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.

ఇక ప్రభాస్ నటిస్తోన్న ఇతర చిత్రాల విషయానికొస్తే.. ఈయన మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్' మూవీ చేస్తున్నారు.  ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోమనన్‌, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ గా ఈ మూవీ రాబోతున్నటు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్ధమవుతోంది.  అటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మూవీలపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇంకోవైపు ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్టు దర్శకుడు ప్రకటించారు.

Also Read: One Man Five Women Preganant: వీడు మగాడ్రా బుజ్జి.. 22 ఏళ్లకే ఐదుగురు భార్యలు, ఒకేసారి తల్లులు కాబోతున్నారు

Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News