Knee Pain Relief: కీళ్ల నొప్పితో బాధపడున్నారా? ఈ చిట్కాలను ప్రయత్నించండి!

Food For Knee Pain Relief: ప్ర‌స్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కీళ్ల నొప్పి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2024, 03:37 PM IST
Knee Pain Relief: కీళ్ల నొప్పితో బాధపడున్నారా? ఈ చిట్కాలను ప్రయత్నించండి!

Food For Knee Pain Relief: ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కీళ్ల సమస్యల ఒకటి. ఈ సమస్య బారిన పడడానికి కారణాలు ఎముక‌ల్లో క్యాల్షియంతక్కువగా ఉండటమే అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. క్యాల్షియం లోపం వ‌ల్ల ఎముక‌లు బ‌ల‌హీనంగా మార‌తాయి. దీని వల్ల కీళ్ల నొప్పులు , ఎముకలు విరగడం వంటి  సమస్యల బారిన  ప‌డుతుంటాం. 

శరీరాకి తగినంత క్యాల్షియాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి  బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అధిక క్యాల్షియం ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. ఆకుకూరలు, పెరుగు, అటుకులు తీసుకోవడం  వల్ల  కీళ్ల నొప్పుల‌ సమస్య నుంచి బయట పడవచ్చు. అంతేకాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలను వండి తినడం వల్ల ఈ సమస్య నుంచి  బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

ముందుగా క‌ళాయిలో రెండు టీ స్పూన్ల ఆలివ్ నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర, క‌రివేపాకు, మున‌గాకు, ప‌సుపు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చిని, అల్లం త‌రుగును, ఉప్పును వేసి వేయించాలి.  త‌రువాత నాన‌బెట్టుకున్న అటుకుల‌ను ఇందులో వేసి కలుపుకోవాలి.

అటుకులు వేగిన త‌రువాత పెరుగు, కొత్తిమీర వేసి క‌లుపుకోవాలి.  రెండు నిమిషాల పాటు క‌లిపిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి.  ఇలా అటుకుల‌ను, పెరుగును క‌లిపి వండి తీసుకోవడం వ‌ల్ల కీళ్ల నొప్పుల నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చని కీళ్ల సంబంధిత వైద్యులు చెబుతున్నారు.

Also read: Gut Health Foods: పేగుఆరోగ్యానికి ఈ 7 అద్భుతమైన ఆహారాలు.. మీ శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఇందులోనే ఉంటాయట..!

మ‌రో వంట‌కం గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

ముందుగా ఒక కళాయిలో ఆలివ్‌ నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మునగాకు, అల్లం, పసుపు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయి ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. త‌రువాత టమాట ముక్కలు వేసి వేయించాలి. ఇందులోకి క్యారెట్ తురుము, ఉప్పు , కారం వేసి వేయించాలి. క్యారెట్ తురుము వేగిన త‌రువాత నాన‌బెట్టుకున్న అటుకుల‌ను నీళ్లు పిండి వేసి క‌లుపుకోవాలి. 

ఈ విధంగా కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు అటుకుల‌తో ఈ వంట‌కాల‌ను చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి  ఫలితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also read: Why Black Grapes Costly: ఆకుపచ్చ ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష ఎందుకు ఖరీదైంది? ఎప్పుడైనా ఈ లాజిక్ ఆలోచించారా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News