IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఈసారి అనూహ్య మార్పులు, నిబంధనలతో ఉండనుంది. ఫ్రాంచైజీ జట్లలో కూడా చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు నుంచి రోహిత్ శర్మ వైదొలగడం దాదాపుగా ఖాయమని తెలుస్తోంది.
ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం చేసిన మార్పులు ఆ జట్టుకు ఇబ్బందిగానే మారుతోంది. జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను రప్పించుకుని అతనికి పగ్గాలు అప్పగించడం అందరికీ తెలిసిందే. ఈ పరిణామం కేవలం రోహిత్ శర్మకే కాకుడా అతని అభిమానులకు జీర్ణించుకోలేని అంశంగా మారింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా పేజ్ నుంచి దాదాపు 5-6 లక్షలమంది బయటికొచ్చేశారు. కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా ముంబై ఇండియన్స్ జట్టు వ్యవహరిస్తున్న తీరు రోహిత్ శర్మతో పాటు అతని కుటుంబసభ్యుల్ని ఎక్కువగా బాధ పెట్టిందని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఆ జట్టులో కొనసాగినా ప్రయోజనం ఉండదని రోహిత్ శర్మ భావించినట్టు తెలుస్తోంది.
అందుకే ఈసారి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కావడానికి ముందే వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఐపీఎల్ కంటే ముందే వైదొలగాలంటే ట్రేడ్ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఐపీఎల్ 2024 మినీ వేలం తరువాత రోజు నుంచి టోర్నీ ప్రారంభానికి నెలరోజులు ముందు వరకూ అవకాశముంటుంది. మార్చ్ నెలఖారులో టోర్నీ ప్రారంభం కానుందని భావిస్తున్న తరుణంలో టోర్నీ నుంచి వైదొలగేందుకు ఇదే అనువైన సమయంగా రోహిత్ శర్మ భావిస్తున్నట్టు సమాచారం.
Also read: PF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్, ఈసారి తగ్గనున్న వడ్డీ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook