Viral News: నువ్వు దేవుడివి భయ్యా.. రెస్టారెంట్ లో టిప్పుగా రూ. 8 లక్షలు.. కారణం ఏంటో తెలుసా..?

Dinner tip: మిచిగాన్ రెస్టారెంట్ కు వచ్చిన మార్క్ అనే కస్టమర్ గొప్ప మనసు చాటుకున్నాడు. రెస్టారెంట్ లో తిన్న దానికి  బిల్లు $32.43 (సుమారు ₹2,000) చెల్లించాడు. అంతే కాకుండా..  బిల్లుపై $10,000 (సుమారు ₹8 లక్షల) ను టిప్పుగా అక్కడి సిబ్బందికి ఇచ్చాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 18, 2024, 11:46 PM IST
  • - రెస్టారెంట్ కు ఊహించని విధంగా షాక్ ఇచ్చిన కస్టమర్..
    - టిప్ అమౌంట్ నోరెళ్ల బెట్టిన సిబ్బంది..
Viral News: నువ్వు దేవుడివి భయ్యా.. రెస్టారెంట్ లో టిప్పుగా రూ. 8 లక్షలు.. కారణం ఏంటో తెలుసా..?

United States Customer Leaves Rs 10,000 Tip:  మనం ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో రెస్టారెంట్లు, హోటల్స్ లకు వెళ్తుంటాం. అక్కడున్న వెరైటీ ఫుడ్ లను తినేస్తుంటాం. హోటల్ లో ఉన్న స్పెషల్స్ పదార్థాలను అడిగి మరీ తెప్పించుకుంటాం. ఒకదాని తర్వాత ఒకటి ఫుడ్ ఐటమ్స్ లను తెప్పించుకుని కడుపు నిండా తినేస్తాం. అయితే... చివరలో  మనకు సర్వ్ చేసిన బెరర్ వచ్చి బిల్ పెట్టి వెళ్తాడు.  ఆతర్వాత  ఆ బిల్లుతో పాటు, కొందరు టిప్‌ గా కొంత డబ్బులను పెడుతుంటారు. సాధారణంగా తిన్న ఫుడ్ కు, కొందరు టిప్ లు పెడుతుంటారు.

Read Also: Rithu Chowdary: కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న రీతూ చౌదరి రీల్స్‌..సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌!

కొందరు వెయ్యిరూపాయలు, ఐదువందలు, వందరూపాలు టిప్ గా ఇస్తుంటారు.ఈ టిప్ అనేది వెళ్లిన రెస్టారెంట్ ను, చేసిన బిల్ ను బట్టి కొందరు అటూ, ఇటుగా ఇస్తుంటారు. మరికొందరు ఫుల్ గా తిన్న కూడా బేరర్ కు టిప్ ఇవ్వకుండానే వెళ్లిపోతుంటారు. అయితే.. ఇలాంటి వారిని సిబ్బంది బూతులు కూడా తిట్టుకొవడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడో కస్టమర్ రెస్టారెంట్ సిబ్బందికి ఏకంగా బిల్లుపై $10,000 (సుమారు ₹8 లక్షల) ను టిప్పుగా ఇచ్చాడు. దీంతో రెస్టారెంట్ సిబ్బంది తొలుత షాక్ కు గురయ్యారు.

ఇది నిజమేనా.. అంటూ మరోసారి కస్టమర్ దగ్గరకు వెళ్లి క్రాస్ చెక్ కూడా చేసుకున్నారు. ఈ టిప్ నార్మగా ఇచ్చే టిప్పుల కన్నా.. 15% నుండి 25% ఎక్కువగా ఉంది. దీని వెనుక ఒక గుండెను పిండేసే కారణముందని కస్టమర్ వారికి వివరించాడు. ఇటీవల మరణించిన స్నేహితుడి జ్ఞాపకార్థం ఇచ్చినట్లు మార్క్‌ చెప్పాడు. అయితే.. ఈ టిప్ ను వెయిటర్లందరు సమానంగా పంచుకుంటున్నట్లు చెప్పారు. తొమ్మిది భాగాలుగా ఈ టిప్పును డివైడ్ చేశారంట. ఒక్కొక్కరికి $1,100 (సుమారు ₹91,000) పంచుకున్నారంట. 

Read Also: Haircare Tips: ఒత్తైన మందపాటి జుట్టు కావాలా? షహనాజ్ హుస్సేన్ బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వండి..

వెస్ట్రన్ మిచిగాన్ విశ్వవిద్యాలయం నుండి ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన ములిక్, విద్యార్థి రుణాల కోసం తన వాటాను పెట్టాలనే తన ప్రణాళికలను చెప్పాడు. ఇక్కడ తాము ఎంతో కష్టపడి పనిచేస్తామని సిబ్బంది చెప్పారు. ఒక రెస్టారెంట్‌కి చిట్కాల రూపంలో $10,000 సంపాదించడానికి ఎంత సమయం పడుతుందని అడిగినప్పుడు, "కొన్నినెలలు పట్టవచ్చని ఆమె చెప్పింది. అంతే కాకుండా.. ప్రస్తుతం ఈరెస్టారెంట్ కస్టమర్ గొప్పమనసును సోషల్ మీడియాలో ఇన్ స్టా గ్రామ్ లో పంచుకున్నారు. దీంతో అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. బ్రో.. గుండెలు పిండేశావ్.., నువ్వు నిజంగా దేవుడివి అంటూ కామెంట్ లు పెడుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News