April Born People Lucky Gemstone In Telugu 2024: రత్న శాస్త్రంలో ప్రకారం ఒక్కొక్క నెలలో పుట్టిన వారు ఒక్కొక్క రత్నాన్ని ధరించడం శుభప్రదమని పేర్కొన్నారు. ప్రతి నెల ఒక్కొక్క జన్మరాశి ఉంటుంది కాబట్టి జన్మరాశికి సంబంధించిన రత్నాన్ని ధరించడం చాలా శుభప్రదమని రత్న శాస్త్రంలో తెలిపారు. అంతేకాకుండా పుట్టిన నెల ప్రకారం రత్న శాస్త్రంలో పేర్కొన్న కొన్ని రత్నాలను ధరించడం వల్ల అదృష్టం పెరగడమే కాకుండా నిత్యజీవితంలో ఆనందం తాండవం చేస్తుందట. అలాగే ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని శాస్త్రంలో తెలిపారు. అంతేకాకుండా జన్మరాశి ఆధారంగా పెట్టుకున్న రత్నాలను ధరించడం వల్ల జీవితంలో పురోగతి కూడా లభిస్తుందని కొందరి నమ్మకం.
రత్న శాస్త్రం ప్రకారం ఏప్రిల్ నెలలో జన్మించిన కొంతమంది ఎంతో ప్రత్యేకమైన వజ్రాన్ని ధరించడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుందట. అలాగే వీరు డైమండ్ ను ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా పొందుతారు. దీంతోపాటు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ ఏప్రిల్ నెలలో జన్మించిన వారు డైమండ్ ని ధరించడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి ప్రయోజనాలు ఏమిటో? వజ్రాన్ని ఎలా ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వజ్రం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రత్న శాస్త్రం ప్రకారం ఏప్రిల్ నెలలో జన్మించిన వారు వజ్రాన్ని ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది అంతేకాకుండా వివాహంలో వస్తున్న అడ్డంకులాన్ని సులభంగా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని రత్న శాస్త్రంలో పేర్కొన్నారు. దీంతోపాటు జాతకంలో శుక్రుడు కూడా బాధపడతారని, శుక్రుడు స్థానం హీన దశలో ఉంటే ప్రత్యేక స్థానంలోకి కూడా చేరుకుంటుందని శాస్త్రంలో తెలిపారు. అంతేకాకుండా ఈ వజ్రాన్ని ధరించడం వల్ల ప్రేమ సంబంధాలలో కూడా మరింత మాధుర్యం పెరిగి ఆడడంకుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మనసులో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. దీంతో పాటు వజ్రాన్ని ధరించడం వల్ల పీడకలలో నుంచి కూడా విముక్తి లభిస్తుందని రత్నశాస్త్రంలో తెలిపారు.
వజ్రం ధరించే సమయంలో పాటించాల్సిన నియమాలు:
వజ్రాన్ని ధరించాలనుకునేవారు తప్పకుండా కొన్ని శుభ సమయాల్లో మాత్రమే దీనిని ధరించడం చాలా శుభప్రదమని రత్న శాస్త్రంలో తెలిపారు. అయితే ఈ డైమండ్ ని ధరించాలి. అనుకునేవారు ప్లాటినం లేదా వెండి ఉంగరంతో తయారు చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనిని శుక్రవారం శుక్లపక్షం ఈ రోజున ధరించడం మాత్రమే చాలా శుభమని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అలాగే ఈ డైమండ్ ధరించే క్రమంలో తప్పకుండా పచ్చిపాలతో శుభ్రం చేసి గంగాజలంతో బాగా కడగాల్సి ఉంటుంది. దీనిని కేవలం ఉంగరం వేలుకు మాత్రమే ధరించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి