Suryakumar yadav Return: ఐపీఎల్ 2024 సీజన్ ను ముంబై ఇండియన్స్ ఓటమితో మెుదలెట్టింది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. రోహిత్ ను కాదని ముంబై యాజమాన్యం పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. హార్దిక్ పై అప్పుడు స్టార్ అయిన ట్రోలింగ్.. ముంబై దారుణంగా ఓడిపోవడంతో అది మరింత పెరిగింది. దానికి తోడు హార్దిక్ ఫెర్మారెన్స్ కూడా పెద్దగా లేదు. మరోవైపు ముంబై సారథ్య బాధ్యతలు రోహిత్ కు అప్పగించాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. వరుస ఓటములుతో కొట్టిమిట్టాడుతున్న ఆ జట్టుకు ఓ గుడ్ న్యూస్ అందింది.
మిస్టర్ 360 బరిలోకి దిగేది ఎప్పుడంటే?
అదేంటంటే.. ప్రపంచ టీ20 నంబర్ వన్ బ్యాటర్, పొట్టి క్రికెట్ కా బాప్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ లో ఆడేందుకు జాతీయ క్రికెట్ ఆకాడమీ నిన్న(ఏప్రిల్ 03) క్లియిరెన్స్ ఇచ్చింది. సూర్య భాయ్ ఫిట్ గా ఉన్నాడని ఆ సంస్థ ప్రకటించడంతో ముంబై అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తాజాగా సూర్య ఎప్పుడు జట్టుతో కలవనున్నాడనే న్యూస్ బయటకు వచ్చింది. సూర్య ఏప్రిల్ 05న ముంబై జట్టులో జాయిన్ అవుతాడని క్రిక్‌బజ్ ఓ కథనాన్ని ప్రచురించింది. సూర్య రాకతో ముంబై విజయాల బాట పడుతుందో లేదో వేచి చూడాలి.
ముంబై తన తర్వాత మ్యాచ్ ను ఏప్రిల్ 07న తన హోం గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. సూర్యకుమార్‌కు వాంఖడేతో మంచి అనుబంధం ఉంది. ఇక్కడో ఎన్నో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లు ఆడాడు సూర్యభాయ్. మిస్టర్ 360 బరిలోకి దిగనున్న నేపథ్యంలో ప్రత్యర్థి జట్లు తమ అస్త్రాలకు పదునుపెడుతున్నాయి. సూర్య చివరిసారిగా గతేడాది డిసెంబరులో సౌతాఫ్రికాపై ఆడాడు. ఆ తర్వాత చీలమండ గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. అతడికి స్పోర్ట్స్ హెర్నియాను తేలడంతో దానికి సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఫిటినెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా అతడు తన ఫిటినెస్ ను నిరూపించుకున్నాడు.
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టు:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, ఇషాన్ కిషన్, విష్ణు వినోద్, నెహాల్ వధేరా, డెవాల్డ్ బ్రెవిస్, పీయూష్ చావ్లా, శ్రేయాస్ గోపాల్, అన్షుల్ కాంబోజ్, మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, తిలాకియో షెపర్డ్, వర్మ, జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, ల్యూక్ వుడ్, క్వేనా మఫాకా.
Also Read: KKR Batter: డెబ్యూ మ్యాచ్‌లోనే ఊచకోత కోశాడు.. అసలు ఎవరీ అంగ్క్రిష్ రఘువంశీ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి