Period Comfort Food: పీరియడ్స్ సమయంలో.. ఏమి తినాలి.. ఏమి తినకూడదు..

Food During Periods : పీరియడ్స్ సమయంలో మనం తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ సమయంలో తీసుకునే జాగ్రత్తలే మన ఆరోగ్యానికి శ్రీరామరక్ష లాంటివి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 19, 2024, 08:00 AM IST
Period Comfort Food: పీరియడ్స్ సమయంలో.. ఏమి తినాలి.. ఏమి తినకూడదు..

Food During Periods In Telugu : పీరియడ్స్ సమయం ప్రతి మహిళకు పరీక్ష లాంటిది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు.. ఒక్కో రకమైన ఇబ్బంది ఈ సమయంలో కలుగుతుంటాయి. అయితే వీటికోసం కెమికల్స్ తో నిండిన మందులు తీసుకోవడం కంటే కూడా ఇంటి వద్ద ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఉత్తమంటున్నారు నిపుణులు. ఈ సమయంలో మనం తీసుకునే జాగ్రత్తలు మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయట. కాబట్టి ఈ టైంలో మనం ఏం తింటున్నాం ఎంత తింటున్నాం అనే విషయంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

ఈ సమయంలో ఆడవారు తీసుకునే ఆహారం శరీరానికి శక్తినిచ్చే విధంగా ఉండాలి. అనవసరమైనటువంటి జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. పీరియడ్స్ సమయంలో చాలావరకు మనకు చికాకుగా, అలసటగా ఉండడంతో పాటు విపరీతమైన కడుపునొప్పి, కాళ్ల నొప్పి ఉంటుంది. ఈ సమయంలో తేలికగా జీర్ణం అయ్యేటటువంటి ఆహారాన్ని తీసుకోవడం ఎంతో మంచిది. ఎక్కువ మసాలాలతో కూడుకున్నటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల సమస్యలు మరింత ఎక్కువవుతాయి.

ఈ సమయంలో చాలామందికి జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తీసుకోవాలని అనిపిస్తుంది. అయితే ఈ సమయంలో ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల లావు కూడా ఎక్కువగా పెరుగుతారు. ఎక్కువ కారంతో చేసినటువంటి వస్తువులు కూడా ఈ సమయంలో తినకపోవడం మంచిది. పీరియడ్స్ సమయంలో వీలైనంతవరకు ఇంటి వద్ద తయారు చేసే భోజన పదార్థాలను తీసుకోండి.

కెఫిన్ 

ఋతుస్రావం సమయంలో కాఫీలు తీసుకోవడం ఎంత తగ్గిస్తే అంత మంచిది. టిఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులోని ఆమ్లాలు మనకు నొప్పిని మరింత పెంచుతాయి. ఈ సమయంలో కాఫీ కి బదులుగా టీ తీసుకోవడం మంచిది.

డార్క్ చాక్లెట్ 

పీరియడ్స్ సమయంలో డాట్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మీ శరీరంలో సెరోటోనిన్‌ని ఉత్పత్తి పెరిగి మానసిక స్థితి మెరుగుపడుతుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల పీరియడ్స్ వల్ల కలిగే కడుపునొప్పి కూడా కాస్త తగినట్లుగా అనిపిస్తుంది.

పండ్లు, కూరగాయలు 

ఈ సమయంలో ఆడవారు ఎక్కువగా తమ ఆహారంలో పండ్లు ,కూరగాయలు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కూడా శరీరంలో వేడి తగ్గుతుంది. ఈ సమయంలో మామూలుగా షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి.. అవి అదుపులో ఉంచుకోవాలి అంటే పండ్లు తినడం మంచిది.

Also Read: Cash For Vote: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్‌ రెడ్డికి ఉచ్చు బిగియనుందా?

Also Read: Revanth Is Lilliput: 'రేవంత్‌ రెడ్డి ఒక లిల్లీపుట్‌': కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News