Summer Cooling Herbs: ఎండ వేడిమి నుంచి శరీరానికి చల్లదనాన్నిచ్చే 5 మసాలాలు..

Summer Cooling Herbs:  ఎండ వేడిమి విపరీతంగా పెరుగుతుంది. వడదెబ్బ రూపంలో ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎండాకాలం నీటిని ఎక్కువగా తీసుకోవాలి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 19, 2024, 11:40 AM IST
Summer Cooling Herbs: ఎండ వేడిమి నుంచి శరీరానికి చల్లదనాన్నిచ్చే 5 మసాలాలు..

Summer Cooling Herbs:  ఎండ వేడిమి విపరీతంగా పెరుగుతుంది. వడదెబ్బ రూపంలో ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎండాకాలం నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవాలి. సీజన్ కి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఎండ వేడిమి నుంచి తట్టుకోవచ్చు. అందుకు చల్లని పండ్లు, కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఆయుర్వేదంలో కొన్ని రకాల మసాలాలు వేసవి వేడి నుంచి మనల్ని కాపాడతాయి.ఈ మసాలాలో బయో ఆక్టివ్ కాంపౌండ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే ఇవి శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తాయి..

మెంతులు..
మెంతులు యాసిడిటీకి వ్యతిరేకంగా పోరాడుతాయి, మలబద్ధకం సమస్యకు చెక్‌ పెడతాయి. మెంతుల్లో కూడా కూలింగ్ గుణాలు ఉంటాయి సాధారణంగా కొంతమంది వంటలు ఉపయోగిస్తారు మరి కొంతమంది రాత్రి నానబెట్టిన మెంతుల నీటిని ఉదయం తాగుతారు వీటిని ఎండాకాలంలో ఈ డైట్ లో చేర్చుకోవాలి.

ధనియాలు..
ధనియాలో కూడా ఆంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఈ శరీరం నుంచి విష పదార్థాలను బయటికి పంపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ధనియాలను కూడా వివిధ వంటల్లో వాడతాం.

ఇదీ చదవండి: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..

పుదీనా...
పుదీనా కూడా  ఎండాకాలం మన డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో కూలింగ్ గుణాలు ఉంటాయి. అజీర్తి, కడుపు సమస్యలతో బాధపడే వారు కూడా పుదీనా మంచి రెమెడీ ఎండాకాలం పుదీనా మన డైట్ లో చేర్చుకోవడం వల్ల చర్మాన్ని కూడా కాంతివంతం చేస్తుంది.

జీలకర్ర..
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టడానికి, వివిధ వంటల్లో జీలకర్ర ఉపయోగిస్తాం అయితే కొన్ని రకాల పానీయాలు కూడా జీలకర్ర ఉపయోగిస్తారు ఇది కూడా జీవన ఆరోగ్యానికి మంచిది ఇందులో ఐరన్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఎండకాలం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

ఇదీ చదవండి: చెర్రీ టమాటలతో 5 ఆరోగ్య ప్రయోజనాలు.. ఇలా తింటే రెట్టింపు లాభాలు..

యాలకులు..
ఈ మసాలాలో కూడా మంచి కూలింగ్ పోషకాలు ఉంటాయి ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది యాలకులు.ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి దీంతో  మన శరీరానికి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News