/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Hyderabad Parliament Constituency:  హైదరాబాద్ అంటే హైటెక్ సిటీనో మరేదో కాదు.. అసలు సిసలు పాతబస్తీతో కూడిన ప్రాంతం.  హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చార్మినార్, చాంద్రాయణ గుట్ట, యాకుత్ పురా, బహదూర్ పురా, కార్వాన్, మలక్ పేట్, గోషా మహల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి.  ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరింటిలో మజ్లిస్ పార్టీ గత కొన్ని దశాబ్దాలుగా తన జెండా ఎగరేస్తూ వస్తోంది. అది పార్లమెంట్ ఎలక్షన్స్ లో దానికి కలసొచ్చే అంశం. ముఖ్యంగా  దేశంలో రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా..మూసీ నది ఆవల వైపు దక్షిణాన  ఉన్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో గత 40 యేళ్లుగా ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్) (AIMIM) పార్టీ తిష్ఠ వేసుకొని కూర్చింది. ఒక రకంగా ఆ పార్టీకి హైదారాబాద్ పార్లమెంట్ స్థానం కంచుకోట అని చెప్పొచ్చు.  ఈ స్థానం నుంచి 1984లో తొలిసారి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎంపీగా గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుసగా 1989, 1991, 1996, 1998, 1999 హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి డబుల్ హాట్రిక్ సాధించారు దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ. ఆ తర్వాత ఆయన పెద్ద కుమారుడు అసదుద్దున్ ఓవైసీ 2004 నుంచి పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా 2009, 2014, 2019లో వరుసగా నాలుగు సార్లు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు.  కానీ 2024 లోక్‌ సభ ఎన్నికల్లో మాత్రం అసదుద్దీన్ ఓవైసీ గెలుపు అంత ఈజీ కాదనే వాదన పలు సర్వేలు ఘోషిస్తున్నాయి. అందుకే లోపాయకారిగా ఎంఐఎం పార్టీకి  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు  అక్కడ డమ్మీ అభ్యర్ధులను నిలబెడుతూ సహకరిస్తూ వస్తున్నాయని బీజేపీ వాళ్లు చేస్తోన్న వాదన.

2009 పార్లమెంట్ డీ లిమిటేషన్ ముందు వరకు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో చేవేళ్ల, తాండూరు, పరిగి వంటి గ్రామీణ నియోజకవర్గాలుండేవి. కానీ 2009 నుంచి పూర్తిగా ముస్లిమ్ ప్రాబల్య ప్రాంతాలతో హైదారాబాద్ పార్లమెంట్ సీటును అసదుద్దీన్ కోసమే అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఈ పార్లమెంట్ సీటును డిజైను చేసినట్టు అందరు చెప్పుకుంటూ వచ్చారు.

2024 లోక్ సభ ఎన్నికల కోసం మార్చి 2న మాధవి లత పేరును మొదటి లిస్టులో హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్ధిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈమె పేరు టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్ గా మారింది. ఈమె పేరు ఇపుడు దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోతుంది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీపై పోటీ చేసిన స్మృతి ఇరానీని గుర్తుకు తెస్తోంది మాధవి లత. తాజాగా ఈమె నేషనల్ మీడియాలో రెగ్యులర్‌గా వచ్చే టీవీ షోలో పాల్గొని దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇక పాతబస్తీ వంటి సున్నిత ప్రాంతం నుంచి పోటీ చేస్తోన్న మాధవి లతకు ఇతర పార్టీల నుంచి కొంత థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో కేంద్రం ఆమెకు Y కేటగిరి భద్రతను కేటాయించింది.

హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి10 సార్లు గెలిచిన ఎంఐఎం పార్టీ అక్కడ ప్రజలకు ఏం చేయలేదని వాదనతో మాధవి లత రంగంలోకి దిగింది.  ముఖ్యంగా డెవలప్‌మెంట్ బేస్డ్ పాలిటిక్స్‌తోనే ఆమె ఎన్నికల బరిలో దిగుతోంది. మరోవైపు ఎంఐఎం పార్టీ ఆమెపై వ్యక్తిగత దూషణలతో పాటు ఆమెకు చెందిన విరించి హాస్పిటల్ ఇష్యూతో పాటు ఆమె భరత నాట్యం చేస్తున్న వీడియోలతో వ్యక్తిగత దూషణలకు దిగడం మొదలుపెట్టారు. తాజాగా హైదరాబాద్ లోక్‌ సభ సీటుపై జన్ లోకపాల్ చేసిన సర్వే సర్వత్రా ఆసక్తిరేకిస్తోంది. తాజాగా ఇక్కడ కొంతి మంది ముస్లిమ్ వర్గాలు మాధవి లతా వైపు మొగ్గు చూపెడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ముస్లిమ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఈ పార్లమెంట్ సీటులో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. గత పదిహేను రోజుల కింద 37 శాతం ఓటు షేర్ ఉంటే.. ఏఐఎంఐఎంకు 48 శాతం ఓటు షేర్ ఉన్నట్టు తెలిపింది. కానీ తాజాగా ప్రకటించిన సర్వేలో బీజేపీ అభ్యర్ది మాధవి లత గ్రాఫ్ అనూహ్యంగా పెరిగినట్టు ఈ సర్వే పేర్కొంది. ఇప్పటి కిపుడు ఎన్నికలు జరిగితే.. ఎంఐఎం పార్టీకి 44.25 శాతం ఓటు షేర్ వస్తే.. బీజేపీకి 42.03 శాతం దాదాపు రెండు పార్టీల మధ్య కేవలం 2 శాతం ఓటు షేర్ డిఫరెన్స్‌గా ఉంది. అటు   కాంగ్రెస్ పార్టీకి 6.70 శాతం   బీఆర్ఎస్ కు 4.05  శాతం.. ఇతరులు 2.9 శాతం ఉంది. మొత్తంగా పదిహేను రోజుల్లో బీజేపీ ఓటు షేర్ హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో అనూహ్యంగా పుంజుకున్నట్టు ఈ సర్వే తెలుపుతుంది. మొత్తంగా ముస్లిమ్ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లుతుందనే విషయం స్పష్టమైంది. ఏది ఏమైనా ఎన్నికలకు మరో నెల రోజులకు పైగా టైమ్ ఉండటం. ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే.. ఈ సారి ఓవైసీకి గెలుపు అంత ఈజీ కాదనే విషయం స్పష్టమవుతోంది.

2024 భారత దేశంలో జరిగే లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం దేశంలోని అన్ని పార్టీలు రెడీ అయ్యాయి. దేశంలో ఏప్రిల్ 19 న తొలి విడత ఎన్నికలతో ఈ  క్రతువు మొదలైన .. జూన్ 1న జరిగే ఏడో విడత ఎన్నికలతో ముగుస్తాయి. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్టు అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.  తాజాగా ప్రముఖ సర్వే సంస్థ జన్‌లోక్ పాల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లపై సంచలన సర్వేను బయట పెట్టింది. ఈ సర్వేను మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 మధ్యలో 2 శాతం శాంపుల్ సైజులో  ఈ సర్వేను నిర్వహించినట్టు ఈ సంస్థ ప్రకటించింది.

Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Hyderabad Parliament Elimination of five lakh bogus votes in Hyderabad district which party will benefit ta
News Source: 
Home Title: 

Hyderabad Parliament: హైదరాబాదులో ఐదు లక్షల బోగస్ వోట్ల తొలగింపు..  ఏ పార్టీకి లాభం..

Hyderabad Parliament: హైదరాబాదులో ఐదు లక్షల బోగస్ వోట్ల తొలగింపు..  ఏ పార్టీకి లాభం..
Caption: 
Hyderabad Parliament (X/Source)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Hyderabad Parliament: హైదరాబాదులో ఐదు లక్షల బోగస్ వోట్ల తొలగింపు.. ఏ పార్టీకి లాభం.
TA Kiran Kumar
Publish Later: 
No
Publish At: 
Wednesday, April 24, 2024 - 09:50
Created By: 
Kiran Kumar
Updated By: 
Kiran Kumar
Published By: 
Kiran Kumar
Request Count: 
28
Is Breaking News: 
No
Word Count: 
643