తెలంగాణ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ షరూ; మరో 24 గంటల్లో తేలనున్న అభ్యర్ధుల భవితవ్యం 

                  

Last Updated : Dec 10, 2018, 01:00 PM IST
తెలంగాణ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ షరూ; మరో 24 గంటల్లో తేలనున్న అభ్యర్ధుల భవితవ్యం 

ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. తెలంగాణలో నెలకొన్న ఉత్కంఠతకు మరో 24 గంటలలో తెరపడనుంది. మరో 24 గంటల్లోపు పూర్తి ఫలితాలు రానున్నాయి. ఓటర్లు తేల్చనున్న అభ్యర్ధుల భవితవ్యం స్ట్రాంగ్ రూంలో భద్రంగా ఉంది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ.. మూడు గంటల పాటు కొనసాగనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యామ్నం 2 గంటల్లోపు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కించిన అనంతరం ఈవీఎంలోని ఓట్లను లెక్కించనున్నారు. కాగా ప్రతి కౌంటింగ్ కేంద్రంలోనూ 14 టెబుళ్లను ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపులనకు ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. సిిసి కెమరాల నిఘాలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.

తెలంగాణ వ్యాప్తంగా 32 వేల 815  పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో గరిష్ఠంగా శేర్ లింగంపల్లిలో 500 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అత్యల్పంగా భద్రాచలంలో 161 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలు తక్కువగా ఉండటం కారణంగా భద్రాచలం ఫలితాలు త్వరగా వెల్లడయ్యే అవకాశం ఉంది. అత్యధికంగా హైదరాబాద్ లో 15 చోట్లు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రెండు గంటల్లోనే తొలి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

Trending News