ED Case On KCR: తెలంగాణలో కలకలం.. త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌ అరెస్ట్‌?

ED Ready To File Case Against Former CM KCR In Sheep Distribution: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఆయన అరెస్ట్‌ తప్పదా? అనేది తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. దీనికి ఎంపీ రఘునందన్‌ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 13, 2024, 07:59 PM IST
ED Case On KCR: తెలంగాణలో కలకలం.. త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌ అరెస్ట్‌?

ED Case On KCR: పద్నాలుగేళ్లు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. పదేళ్లు పరిపాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్‌కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తృటిలో అధికారం కోల్పోగా.. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఈ క్రమంలో కేసీఆర్‌ను కేసులు వెంటాడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

Also Read: BS Yediyurappa: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎం యడియూరప్పకు భారీ షాక్‌.. అరెస్ట్‌ తప్పదా?

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేసీఆర్‌ అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మారడంతో మరిన్ని ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే అవేవీ నిరూపితం కావడం లేదు. అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి మాత్రం కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపేయాలని కంకణంతో ఉన్న రేవంత్‌ రెడ్డి తదనుగుణంగా కార్యాచరణ చేపడుతున్నారు.

Also Read: Dauther In Laws: మామల విజయం వెనుక కోడళ్లు.. ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా ఆ ముగ్గురు..!

అయితే ఓటుకు నోటు కేసులో కేసీఆర్‌ తనను జైలుకు పంపించిన ఉదంతాన్ని రేవంత్‌ రెడ్డి మనసులో పెట్టుకున్నారు. దీంతో కేసీఆర్‌ను కూడా ఎలాగైనా జైలుకు పంపాలనే పగతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సునిశితంగా పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం, విద్యుత్‌ కొనుగోళ్లు తదితర అంశాలపై కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ ఇంకా నిరూపితం చేయలేదు.

రఘునందన్ వ్యాఖ్యలు కలకలం
ఈ క్రమంలోనే గొర్రెల పంపిణీ పథకం ఒక అస్త్రంగా లభించినట్టు కనిపిస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగినట్లు సమాచారం. దీనికి బీజేపీ మెదక్‌ ఎంపీ రఘునందన్‌ చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. 'మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసింది' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతి, నిధుల దుర్వినియోగంపై ఈడీ రంగంలోకి దిగింది. విచారణలో భాగంగా తమకు అవసరమైన వివరాలను సమర్పించాలని రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకదారుల సహకార సమాఖ్య ఎండీకి ఈడీ లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఆ నివేదిక ఆధారంగా ఈడీ ముందడుగు వేసే అవకాశం ఉంది.

రేవంత్ కుట్ర?
రాజకీయంగా పరాభవం కోల్పోయిన కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయాలనే పట్టుదలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని గులాబీ పార్టీ వాదిస్తోంది. ఇప్పటికే ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ పార్టీ ఉనికి లేకుండా చేసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్‌, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నాయని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపిస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకుని తమ పార్టీని దెబ్బతీశాయని గులాబీ దళం ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు కేసీఆర్‌ ఈడీని అరెస్ట్‌ చేస్తే కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయని స్పష్టంగా తెలుస్తుందని చెప్పేందుకు ప్రతిపక్ష పార్టీ సిద్ధమైంది. కేసీఆర్‌ అరెస్ట్‌ కోసం రేవంత్‌ రెడ్డి బీజేపీలోకి చేరే అవకాశం కూడా లేదని గుర్తు చేస్తోంది. ఏది ఏమైనా తెలంగాణలో కేసీఆర్‌ అరెస్ట్‌ అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. మరి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News