Bharateeyudu 2 Trailer: టామ్ అండ్ జెర్రీ ఆట మొదలు.. అదరగొట్టిన భారతీయుడు

Indian 2 Trailer: కమల్ హాసన్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో.. వస్తోన్న భారతీయుడు 2 పైన ఎటువంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల అయింది. మరోసారి కమల్ హాసన్ భారతీయుడి పాత్రలో అదరగొట్టి అందరిని ఆకట్టుకుంటున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 25, 2024, 08:10 PM IST
Bharateeyudu 2 Trailer: టామ్ అండ్ జెర్రీ ఆట మొదలు.. అదరగొట్టిన భారతీయుడు

Bharateeyudu 2 trailer: తమిళ ప్రేక్షకులతో పాటు.. తెలుగు ప్రేక్షకులు కూడా.. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో భారతీయుడు 2 ఒకటి. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి.. శంకర్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీ గా ఉంది. 

ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులు ఎప్పటినుంచో కళ్ళుకాయలు కాచేరా ఎదురుచూస్తున్న చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 2:38 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే..సినిమాలో సిద్ధార్థ్ చాలా కీలకపాత్ర పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. ‘అందరినీ చీల్చి చెండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. అప్పట్లో ఉండేవాడు. అతనే భారతీయుడు’ అంటూ కమల్ హాసన్ పోషిస్తున్న సేనాపతి.. పాత్ర పరిచయం బావుంది. 

మళ్లీ ఇన్ని దశాబ్దాల తర్వాత.. కమల్ హాసన్ ని భారతీయుడు పాత్రలో చూడటం ప్రేక్షకులలో తప్పకుండా ఆసక్తి నెలకొల్పింది. అయితే ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే.. సేనాపతి పాత్ర విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ సేనాపతి పాత్ర భారతదేశానికి ఎందుకు తిరిగి వచ్చింది, ఎవరు సేనాపతిని పిలిచారు, సేనాపతి ఏం చేశాడు.. అసలు సిద్ధార్థ కు సేనాపతికి ఉన్న సంబంధం ఏమిటి.. అనేది ఈ సినిమా కథ అని టైలర్.. చూస్తే తెలుస్తోంది. 

లుక్స్ పరంగా కూడా కమల్ హాసన్ ప్రేక్షకులను చాలా బాగా మెప్పించారు. ట్రైలర్ ఆఖరిలో కమల్ హాసన్ చెప్పే "ఇది రెండవ స్వాతంత్ర యుద్ధం. గాంధీజీ మార్గంలో మీరు. నేతాజీ మార్గంలో నేను" అని చెప్పే డైలాగ్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది.

రకుల్ ప్రీత్ ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. ఎస్ జే సూర్య ఈ సినిమాలో ఒక సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ సింహ, సముతిరఖని, ప్రియా భవాని శంకర్ లతో పాటు బ్రహ్మానందం కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ వారు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవి చందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: Pension Hike: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూలై 1న పండగే.. ఒక్కొక్కరికి రూ.7 వేలు

Also Read: Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News