Sleeplessness: సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. అయితే ఈ డ్రింక్స్ మీకోసమే..

Insomnia Tips : నిద్రలేమి తో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇంట్లోనే చేసుకోగల.. కొన్ని పానీయాలలో.. నిద్రలేమిని తరిమేసి హాయిగా నిద్రపోవచ్చు. అవును ఈ పానీయాలు తాగడం వల్ల ఎంతో ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది. మరి అంతలా మనకి మంచి నిద్రను ఇచ్చే.. ఆ పానీయాలు ఏంటో చూద్దాం. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 28, 2024, 10:00 PM IST
Sleeplessness: సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. అయితే ఈ డ్రింక్స్ మీకోసమే..

Sleep Drinks: ఉదయం నుంచి ఎంతో కష్టపడే శరీరానికి.. రాత్రి అయ్యాక.. మంచి నిద్ర ఉండటం చాలా ముఖ్యం. 18 నుంచి 60 సంవత్సరాల వయసులోపు వాళ్ళు ..ఒక రోజుకి కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు నిద్రపోవాలి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. నిద్ర పట్టకపోయినా కూడా ఆరోగ్యానికి హాని జరుగుతుంది. మంచి నిద్ర ఆరోగ్యానికి మొదటి సూత్రం. అయితే సహజంగా.. నిద్రను మెరుగుపరచడానికి కొన్ని అద్భుతమైన పానీయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 

చెర్రీ జూస్:

చెర్రీలలో ఉండే ట్రిప్టోఫాన్, మెలటోనిన్ వంటిది మన నిద్ర ను మెరుగు పరుస్తాయి. రోజుకి రెండు కప్పులు.. చెర్రీ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో మెలటోనిన్ స్థాయి పెరిగి రాత్రుళ్ళు చక్కగా నిద్ర పడుతుంది.

చామోమిల్ టీ:

చామోమిల్ నుండి తయారయ్యే టీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందులో మంచి నిద్ర కూడా ఒకటి. జలుబు లక్షణాలు తగ్గించడం, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచటం వంటి వాటికి కూడా ఉపయోగపడే చామోమిల్ టీ పడుకునే ముందు తాగడం వల్ల ఆందోళన తగ్గి చక్కగా నిద్ర పడుతుంది. 

అశ్వగంధ టీ:

ఆయుర్వేదంలో అశ్వగంధ ని ఔషధ మొక్కగా పిలుస్తారు. శక్తివంతమైన ఔషధ మొక్కగా.. పేరు ఉన్న అశ్వగంధ న ఇండియన్ జిన్సెంగ్ అని, వింటర్ చెర్రీ అని కూడా పిలుస్తారు. అశ్వగంధ వల్ల కలిగే బోలెడు ప్రయోజనాలలో నిద్రలేమి పోవడం కూడా ఒకటి. 

వలేరియన్ టీ:

అశ్వగంధ లాగానే వలేరియన్ ను కూడా ఔషధ మూలికగా ఉపయోగిస్తారు. ఇది నిద్రను ప్రోత్సహించి, నిద్రలేమి నుండి ఉపశమనం ఇస్తుంది. నిద్రను మెరుగుపరచడంలో.. కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా రుతుక్రమం ఆగిన మహిళల్లో కూడా దీని ఉపయోగాలు బోలెడు. 

పిప్పరమింట్ టీ:

పిప్పరమింట్ చాలా సంవత్సరాలుగా సాంప్రదాయ వైద్యంలో ఒక భాగం. అందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ-అలెర్జెనిక్ లక్షణాలు అజీర్ణం, జీర్ణకోశ అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. దానివల్ల నిద్ర కూడా మెరుగుపడుతుంది. 

గోరువెచ్చని పాలు:

ఇది మన అమ్మమ్మల కాలం నుండి వింటున్న మాట. పెద్దల మాట చద్దన్నం మూట అంటారు. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ మన మెలటోనిన్ స్థాయిలను.. పెంచి నిద్రకు సహాయపడుతుంది. 

బంగారు పాలు:

బంగారు పాలు అంటే పాలల్లో బంగారం ఏమి కలపాల్సిన అవసరం లేదు. గోరువెచ్చని పాలలో.. పసుపు, అల్లం వేసుకుని తాగితే చాలు. దీని వల్ల నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది.

బాదం పాలు:

బాదం లో ఉండే ఆరోగ్యకరమైన ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు నిద్ర ను మెరుగుపరుస్తాయి. బాదంలో నిద్రను ప్రేరేపించే హార్మోన్లు, మినరల్స్ ఉంటాయి. అందుకే బాదం నిద్రపోవడానికి బాదం పాలు బాగా సహాయపడతాయి.

ఈ పానీయాలను 5 నిమిషాల్లో లేదా అంతకంటే తక్కువ సమయంలో చేసుకుని తాగవచ్చు. వీటివల్ల చక్కగా నిద్ర పడుతుంది.

Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..

Read more: Snakes Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News