Nabha Natesh: లాంగ్ గ్యాప్ తర్వాత ‘డార్లింగ్’ మూవీతో పలకరించబోతున్న నభా నటేష్.. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్..

Nabha Natesh: ఇస్మార్ట్ పోరిగా నభా నటేష్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్నే సంపాదించుకుంది. ఆ మధ్య తన అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా వరుస సినిమాలతో పలకరించబోతుంది. ఈ కోవలో నభా నటేష్ ముఖ్యపాత్రలో డార్లింగ్ మూవీతో పలకరించబోతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 9, 2024, 06:45 PM IST
Nabha Natesh: లాంగ్ గ్యాప్ తర్వాత ‘డార్లింగ్’ మూవీతో పలకరించబోతున్న నభా నటేష్.. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్..

Nabha Natesh: తెలుగు సినీ ఇండస్ట్రీలో అందంతో పాటు అభినయం కలగలిసిన హీరోయిన్స్ లలో నభా నటేష్ ఒకరు. తొలి సినిమా నుంచే డిఫరెంట్ పాత్రలతో అలరిస్తూనే ఉంది. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో తెలుగులో ఓవర్ నైట్ పాపులర్ హీరోయిన్  అయింది. మధ్యలో అనారోగ్యం కారణంగా కాస్త గ్యాప్ వచ్చింది. పూర్తిగా కోలుకున్నాకా.. ఆమె నుంచి వస్తోన్న ఫస్ట్ మూవీ ‘డార్లింగ్’. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ ట్రైలర్ లో స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న అమ్మాయిగా నభా నటేష్ యాక్టింగ్ కు మంచి మార్కులు పడుతున్నాయి.  ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా వచ్చిన కథానాయకుడు విశ్వక్ సేన్, డైరెక్టర్ అశ్విన్ రామ్ డార్లింగ్ సినిమా పట్ల నభా చూపించిన శ్రద్దను  మెచ్చుకున్నారు.  టూ ఇయర్స్ బ్యాక్  కిందట యాక్సిడెంట్ కు గురైన నభా ఆ ప్రమాదం నుంచి తేరుకుని మళ్లీ స్క్రీన్ మీద అంతే ఎనర్జిటిక్ గా కనిపించడం మాములు విషయం కాదంటూ మెచ్చుకుంటున్నారు.  

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది కృంగిపోతారు. కానీ నభా మాత్రం గోడకు కొట్టిన బంతిలా బ్యాక్ బౌన్స్ అయింది. అంతేకాదు నభా ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న విధానం ఎంతో మందికి స్పూర్తి నిస్తుంది. నటిగా ఆమెకున్న పట్టుదల, అంకితభావం చాలా గొప్పవని కొనియాడారు.

దర్శకుడు అశ్విన్ రామ్ మాట్లాడుతూ..
డార్లింగ్ కథ ను కొందరు హీరోయిన్స్ కు చెప్పినప్పుడు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ క్యారెక్టర్ చేసేందుకు వెనకడుగు వేసారు. కమల్ హాసన్, విక్రమ్ లాంటి వాళ్లు ఇలాంటి పాత్రలతో మెప్పించారనేది వారిలో ఉన్న భయం. కానీ నభాకు స్టోరీ చెప్పినప్పుడు ఇంతేనా.. చేస్తాను అని ఎంతో డెడికేషన్ తో ఈ సినిమా చేసిన విషయాన్ని  ప్రస్తావించారు.

నభా నటేష్ మాట్లాడుతూ..

ప్రమాదం జరిగిన తర్వాత ఎలాంటి మూవీ చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఈ కథ నచ్చి వెంటనే చేసేసాను.  ఇలాంటి పాత్రలు ఎపుడూ కానీ దక్కవు.ఇలాంటి సినిమాలో  నటించాలనే నా డ్రీమ్ ఈ సినిమాతో ఫుల్ ఫిల్ అయిందన్నారు.  

ప్రియదర్శితో కలిసి నభా నటేష్ లీడ్ రోల్ లో నటించిన డార్లింగ్ సినిమాకు అశ్విన్ రామ్ డైరెక్ట్ చేశారు. రొమాంటిక్ కామెడీగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సంయుక్తంగా నిర్మించారు. డార్లింగ్ సినిమా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ గా విడుదల కాబోతుంది.

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News