Salaar: జపాన్ లో సలార్ రచ్చ.. విదేశాల్లో కూడా రెబల్ స్టార్ మాస్ ఊచకోత ..

Salaar: ప్రస్తుతం తెలుగులో బడా హీరోల ప్యాన్ ఇండియా చిత్రాలకు విదేశాల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. బాహుబలి పుణ్యామా అని విదేశీ ప్రేక్షకులకు కూడా మన సినిమాల అంటే మోజు ఏర్పడింది. ఇక జపాన్ దేశంలో మన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.ఇప్పటికే అక్కడ ఆర్ఆర్ఆర్ సినిమా యేడాదికి పైగా నడించి సంచలనం రేపింది. తాజాగా ప్రభాస్ ‘సలార్’ జపాన్ లో విడుదలై వీర విహారం చేస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 11, 2024, 09:43 AM IST
Salaar: జపాన్ లో సలార్ రచ్చ.. విదేశాల్లో కూడా రెబల్ స్టార్ మాస్  ఊచకోత ..

Salaar: ప్రస్తుతం తెలుగు సహా ప్యాన్ ఇండియా భాషల్లో ప్రభాస్ జోరు మాములుగా లేదు. యేడాది గ్యాప్ లోనే మూడు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రచ్చే చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన ‘సలార్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. లాంగ్ రిలీజ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది. మరోవైపు తాజాగా ‘కల్కి 2898 ఏడి’ మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే రూ. 950 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ వరకు ఈ సినిమా రూ. 1000 కోట్ల గ్రాస్ క్లబ్ లో ప్రవేశించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

అంతేకాదు ‘బాహుబలి 2’ తర్వాత రూ. వెయ్యి కోట్ల గ్రాస్ రాబట్టిన రెండో ప్రభాస్ చిత్రంగా నిలుస్తుంది. అటు మన తెలుగులో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ తర్వాత మూడో వెయ్యి కోట్ల సినిమాగా ‘కల్కి’  రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. ఇక ఈయన లాస్ట్ మూవీ ‘సలార్’ మూవీ తాజాగా జపాన్ దేశంలో విడుదలైంది. అంతేకాదు ‘బాహుబలి’ సినిమాతో రెబల్ స్టార్ కు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. ఆయన సినిమాలకు అక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది. రీసెంట్ గా జపాన్ దేశంలో విడుదలైన ‘సలార్’ మూవీ అక్కడ ఫస్ట్ వీకెండ్ లో 1.2జపాన్ మిలియన్ యెన్స్ ను రాబట్టి మంచి ఓపెనింగ్స్ తో దూసుకుపోతుంది. మన దేశ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. కోటి గ్రాస్ అని చెప్పాలి.

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie)తో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తూ ఉండగా మరో పక్క తన ప్రీవియస్ మూవీ అయిన సలార్(salaar Part 1 – Ceasefire) సినిమా తో రెబల్ స్టార్ రీసెంట్ గా జపాన్ లో మాస్ రచ్చ చేయడం స్టార్ట్ చేశాడు…

ఇక జపాన్ లో విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రం అక్కడ 44 మిలియన్ జపాన్ యెన్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత సాహో సినిమా అక్కడ 23 మిలియన్ జపాన్ యెన్స్ తో రెండో ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ జపాన్ డబ్బింగ్ వెర్షన్ రిలీజై 20 మిలియన్ జపాన్ యెన్స్ ను కొల్లగొట్టింది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ అక్కడ 64 మిలియన్ జపాన్ యెన్స్ తో టాప్ ప్లేస్ లో ఉందనే చెప్పాలి.

తాజాగా ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మించిన ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’ మూవీ ఇపుడు జపాన్ లో తన రచ్చ మొదలు పెట్టింది. మొత్తంగా లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News