Telangana Heavy Rains: తెలంగాణకు మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు అరెంజ్ అలర్ట్.. మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నాయి. ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ జిల్లాల్లో 11.5 నుంచి 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. అంతేకాదు వర్షాలకు తోడు ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడటం, విద్యుత్ సరఫరా స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ఏర్పడటం వంటివి జరగవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆయా జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు బయటకు వెళ్లేటపుపుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రేపు ఎల్లుండి ఆదిలాబాద్, యశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంకుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందలు పడే అవకాశాలున్నాయి. కాలువలు, పంట పొలాలు మునిగే అవకాశాలున్నట్టు చెప్పింది. దీంతో జిల్లా వ్యవసాయాధికారులు .. స్థానికంగా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు, సలహాలు అందజేస్తోంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
శనివారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు పడతాయి. తెలంగాణలో నిన్న పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కుంచవెల్లిలో 13.2 సెంటీ మీటర్ల భారీ వర్షం కురిసింది. వికారాబాద్, మెదక్, ములుగు, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. భారీ వర్షాల వల్ల స్థానికంగా ఉండే చెరువుల, డ్యామ్ లు నిండు కుండలను తలపిస్తున్నాయి.
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook