Viraaji Trailer Talk: విరాజి ట్రైలర్ టాక్.. వరుణ్ సందేశ్ ఈ సారి గట్టిగానే కొట్టేలా ఉన్నాడే..!

Viraaji Trailer Talk: వరుణ్ సందేశ్ నిన్న మొన్నటి వరకు తెలుగులో లవర్ బాయ్ పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. ఇపుడు రూట్ ఛేంజ్ చేసి డిఫరెంట్ మూవీలతో పలకరిస్తున్నాడు. ఈ రూట్లోనే  వరుణ్ సందేశ్ హీరోగా  నటిస్తూన్న మరో మూవీ ‘విరాజి’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 22, 2024, 01:15 PM IST
Viraaji Trailer Talk: విరాజి ట్రైలర్ టాక్.. వరుణ్ సందేశ్ ఈ సారి గట్టిగానే కొట్టేలా ఉన్నాడే..!

Viraaji Trailer Talk: మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘విరాజి’.   ఆద్యంత్ హర్ష డైరెక్షన్ లో  మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను వరుణ్ సందేశ్ బర్త్ డే  సందర్భంగా 'కొత్త బంగారు లోకం' చిత్ర డైరెక్టర్  శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు.

ఈ ట్రైలర్ సస్పెన్స్, హార్రర్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇప్పటి వరకు చేయని కొత్త జానర్ లో ఈ సినిమా చేసాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ లుక్ కూడా ఫ్రెష్ గా ఉంది. 1970లో ఒక ఎత్తైన కొండపై మెంటల్ పేషెంట్స్ కోసం  నిర్మించిన ఓ భవంతి ఎలా దెయ్యాల కొంపగా మారింది. అందులో ఆత్మలు ఎందుకున్నాయనే కాన్సెప్ట్ బాగుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. వరుణ్ సందేశ్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News