Korba Express Catch In Fire: విశాఖపట్నం రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్బ ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మూడు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ప్రమాదం సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రాణం నష్టం కాకుండా ఆస్తి నష్టం భారీగా జరిగింది. వెంటనే మంటలు ఆర్పేందుకు రైల్వే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Also Read: Cloths Issue Attack: ఆరేసిన బట్టలపై మహిళల మధ్య కొట్లాట.. మటన్ కత్తితో తెగిన ఒకరి పీక
చత్తీస్‌గడ్‌లోని కోర్బా నుంచి విశాఖపట్టణానికి ఎక్స్‌ప్రెస్ రైలు (18517) చేరుకుంది. ఇక్కడి నుంచి ఆదివారం మధ్యాహ్నం ఆ రైలు తిరుమలకు వెళ్లాల్సి ఉంది. ఈ రైలు విశాఖ స్టేషన్లో 4 నంబర్ ప్లాట్ఫారం వద్ద నిలిపి ఉంచారు. ఉదయం ఆగి ఉన్న రైలులో నుంచి మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలతో భారీగా మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు భయాందోళన చెందారు. వెంటనే స్టేషన్ బయటకు పరుగులు పెట్టారు. వెంటనే తేరుకున్న రైల్వే అధికారులు మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదంలో ఏసీ బోగీల్లో ఎం1, బీ7, బీ6 బోగీలు మంటలకు బూడిదయ్యాయి. మంటలు చెలరేగడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Yamini Krishnamurthy: ఒక కాలిగజ్జె తిరిగిరాని లోకాలకు.. యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని విశాఖపట్టణం రైల్వే ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఉదయం 10 గంటలకు రైలులో మంటలు చెలరేగాయని, వెంటనే సహాయ చర్యలు చేపట్టినట్లు వివరించారు. నాలుగు అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. దగ్ధమైన బోగిలను రైలు నుంచి వేరు చేసినట్లు వెల్లడించారు. బీ7 బోగిలోని వాష్‌రూమ్‌లో షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అక్కడ చెలరేగిన మంటలు క్రమంగా మిగతా వాటికి విస్తరించినట్లు రైల్వే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలుపుతామని పోలీసులు చెప్పారు. ప్రమాదం విషయం తెలుసుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత రైల్వే పోలీసు అధికారులను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణాలు, సహాయ చర్యలు ఆరా తీశారు.
Fire broke out in three AC coaches of Korba-Visakhapatnam Express on Sunday morning shortly after the train arrived at #Vizag railway station.
The fire began near A1 coach, prompting passengers to raise an alarm. All passengers were evacuated safely.
Follow us @NewsMeter_In pic.twitter.com/JKhuzzFV5o
— SriLakshmi Muttevi (@SriLakshmi_10) August 4, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి