1992 Ajmer Rape Cases : వంద మంది కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం..32 ఏండ్ల తర్వాత నిందితులకు జీవిత ఖైదు

Ajmer 1992 Sex Scandal:  1992వ సంవత్సరంలో దేశాన్ని కుదిపేసిన సెక్స్ స్కాండల్, అజ్మీర్ బ్లాక్ మెయిల్ కేసులో ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం కోర్టు తీర్పును వెలువరించింది. వారికి రూ. 5లక్షల జరిమానా విధిస్తూ..అజ్మీర్ లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ లైంగిక కుంభకోణంలో మొత్తం 18 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో 9మందికి ఇప్పటికే శిక్ష పడింది. మిగిలిన 9 మంది నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరు పరారీలో ఉండగా...ఆ ఒకరిపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది.   

Written by - Bhoomi | Last Updated : Aug 20, 2024, 05:10 PM IST
1992 Ajmer Rape Cases : వంద మంది కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం..32 ఏండ్ల తర్వాత నిందితులకు జీవిత ఖైదు

Ajmer 1992 Sex Scandal : రాజస్థాన్ లోని అజ్మీర్ సెక్స్ స్కాండల్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం స్రుష్టించింది. 1992లో ఈ కేసుకు సంబంధించిన తీర్పును నేడు అజ్మీర్ పోక్సో కోర్టు తీర్పును వెలువరించింది. ఆరుగురు నిందితులను కోర్టు దోషుగా నిర్ధారించింది. నిందితులందర్నీ ఈరోజు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసులో ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ నేడు కోర్టు తీర్పును వెలువరించింది. వారికి రూ. 5లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో మొత్తం 18 మంది దోషులగా తేలగా..వారిలో 9 మందికి ఇప్పటికే శిక్ష పడింది. మిగిలిన తొమ్మిది మంది నిందితుల్లో ఒకరు సూసైడ్ చేసుకున్నాడు. ఒకరు పరారీలో ఉండగా..అతనిపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది.  నిందితులు నఫీస్ చిస్తీ, నసీమ్ అలియాస్ టార్జాన్, సలీం చిస్తీ, ఇక్బాల్ భాటి, సోహైల్ ఘని, సయ్యద్ జమీన్ హుస్సేన్‌లను పోస్కో కోర్టు దోషులుగా నిర్ధారించింది. 

1992లో, నిందితులు అజ్మీర్‌లోని ప్రసిద్ధ మాయో కాలేజీలో 100 మందికి పైగా విద్యార్థినులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశారు. వారి నగ్న చిత్రాలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ..వేరే అమ్మాయిలను తమ వెంట తీసుకునిరావాలంటూ ఒత్తిడి చేశారు. ఇలా వందమంది అమ్మాయిలపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది.

 ఈ నగ్న ఛాయాచిత్రాల ఆధారంగా ఈ ముఠా డబ్బు సంపాదించింది. దీంతో  ఈ భారీ బ్లాక్ మెయిలింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల నగ్న చిత్రాలను ఇతరులకు షేర్ చేస్తూ అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా ఈ కుంభకోణంలో నలుగురు నిందితులు ఇప్పటికే శిక్షను అనుభవించారు. కోర్టు వారిని దోషులుగా ప్రకటించడంతో పోలీసులు నిందితులందరినీ తమ కస్టడీలోకి తీసుకున్నారు.

Also Read : Gold Outlook: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. త్వరలోనే లక్ష దాటనున్న బంగారం ధర.. ఎప్పుడంటే ?

32 సంవత్సరాల క్రితం జరిగిన లైంగిక కుంభకోణంలో మొత్తం 18 మంది నిందితులుగా ఉన్నారు. 9 మందికి ఇప్పటికే శిక్ష పడింది, ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక నిందితుడిని పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటించింది. మిగిలిన వారిని నేడు దోషులుగా కోర్టు ప్రకటించింది.అలాగే, ఈ కేసులో 6 మంది నిందితులు ఈ ఏడాది జూలైలో తమ విచారణను పూర్తి చేశారు. తీర్పును ఆగస్టు 8న ప్రకటించాల్సి ఉండగా, ఈ కేసులో కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. 

ఈ కేసులో జీవిత ఖైదు పడిన 8 మంది నిందితులు డీజే కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేశారు. 2001లో, లైంగిక కుంభకోణంలో నలుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించగా, మిగిలిన నలుగురి శిక్షను సమర్థించారు. మిగిలిన నలుగురు నిందితులు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించింది. 2003లో నలుగురి శిక్షను యావజ్జీవ కారాగార శిక్ష నుండి 10 సంవత్సరాలకు తగ్గించింది. నిందితులు ఇప్పటికే 10 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించినందున, అందరూ జైలు నుండి విడుదలయ్యారు.

Also Read : Ambani-Adani: అంబానీ పవర్‎..అదానీ చేతుల్లోకి..ఏకంగా వేల కోట్లకు డీల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News