Nagarjuna: తెలుగు రాష్ట్రాలతోపాటు సినీ పరిశ్రమలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కలకలం రేపింది. సినీ నటుడు అక్కినేని నాగచైతన్యకు సంబంధించిన ఎన్ కన్వెషన్ సెంటర్ చెరువు భూమిలో ఉందనే ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగార్జున ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై పుకార్లు, ఊహాగానాలు, పుకార్లు భారీగా వస్తున్నాయి. నాగార్జున వ్యవహారంపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే వాటిని నాగార్జున ఖండించారు. కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఎపిసోడ్ నుంచి నాగార్జున తన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. ఇప్పుడు కూల్చివేతపై తన తదుపరి కార్యాచరణను అమలుచేస్తున్నారు. తాను న్యాయ పోరాటం చేస్తానని.. న్యాయం తనవైపు ఉందని పేర్కొన్నారు.
Also Read: Nagarjuna Vs Revanth Reddy: నాగార్జునను... రేవంత్ అప్పుడే టార్గెట్ చేశారా..?
తాను చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించలేదని మరోసారి నాగార్జున స్పష్టం చేశారు. కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించానని.. న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు ఎవరూ ఎలాంటి వార్తలు, పుకార్లు పట్టించుకోవద్దు అని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తన 'ఎక్స్' వేదికగా నాగార్జున ఒక విజ్ఞప్తి చేశారు. అభిమానులు, శ్రేయోభిలాషులకు ప్రకటన చేశారు. 'ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ. ఎన్ కన్వెన్షన్‌కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు' అని స్పష్టం చేశారు.
Also Read: Nagarjuna: హైడ్రా దెబ్బ.. బిగ్ బాస్ నుండి నాగార్జున అవుట్.. ?
'తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురికాలేదని ప్రత్యేక కోర్టు, AP Land Grabbing (Prohibition) Act, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇచ్చింది' అని నాగార్జున గుర్తు చేశారు. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టును ఆశ్రయించా. న్యాయస్థానం తీర్పుకు నేను కట్టుబడి ఉంటా' అని స్పష్టం చేశారు. అయితే న్యాయస్థానం నిర్ణయం వచ్చేవరకు ఊహాగానాలు.. పుకార్లు.. అవాస్తవాలు నమ్మవద్దు' అంటూ సవినయంగా అభ్యర్ధించారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం హైడ్రా ద్వారా కూల్చివేయడాన్ని సమర్ధించుకుంటోంది. కానీ హైడ్రా కూల్చివేత పనులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి