Foods Avoid During Pregnancy: ప్రెగ్నెన్సీ అనేది మహిళలకు అతి ముఖ్యమైన సమయం. ఇది కొత్తగా తల్లి కాబోతున్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈసమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇది ఆరోగ్యకరమైన బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో సహకరిస్తుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో అందరూ ఎన్నో సలహాలు కూడా ఇస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో ఖనిజాలు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. మరికొన్ని ఆహారాలు కచ్చితంగా డైట్లో చేర్చుకోవాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రెగ్సెన్సీ సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు తెలుసుకుందాం.
సరిగ్గా ఉడకని మాంసం, గుడ్లు, సముద్రపు ఆహారాలు..
ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం సరిగ్గా ఉడకని మాంసంలో ప్రాణాంతక బ్యాక్టిరియా పెరుగుతుంది. ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ హానికరం. అలాగే సరిగ్గా ఉడకని సముద్రపు ఆహారాలు కూడా ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోకూడదు. ఇందులో కూడా ప్రాణాంతక బ్యాక్టిరియా అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మాంసం, గుడ్లలో సల్మోనెల్లా ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కూడా దారితీస్తుంది.
అతిగా పాదరసం ఉండే చేపలు..
ఇలా అతిగా పాదరసం స్థాయిలు ఉండే చేపలను కూడా ప్రెగ్నెన్సీ సమయంలో తినకూడదు ఇది బేబీ బ్రెయిన్ అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే సాల్మాన్ చేప, రొయ్యలు కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది బేబీ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
పాల ఉత్పత్తులు..
పాశ్చరైజ్ చేయని పచ్చిపాలు, చీజ్‌లో కూడా ప్రాణాంతక బ్యాక్టిరియా పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పాశ్చరైజ్ చేయని ఆహారాలు, చీజ్‌లో లిస్టేరియా కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టిరియా పెరగడానికి దారితీస్తుంది. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. దీని వల్ల అబార్షన్ ఇతర వ్యాధులకు దారితీస్తుంది.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
స్ప్రౌట్స్..
ఆల్ఫాల్ఫా, ర్యాడిష్ బ్యాక్టిరియాకు కారణమవుతుంది. ఇందులోని సాల్మొనెల్లా వల్ల ప్రెగ్నెన్సీ మహిళలు వీటికి దూరంగా ఉండాలి. ఉడకబెట్టని స్ప్రౌట్స్ వల్ల కడుపు సంబంధిత వ్యాధులకు కూడా దారితీస్తుంది. అందుకే మొలకలు వంటివి తీసుకుంటే ముందుగార బాగా ఉడకబెట్టిన తర్వాతే వాటిని తీసుకోవాలి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు వాటికి దూరంగా ఉంే మరీ మంచిది.
కెఫీన్..
కాఫీ వంటివి ఓ మోతాదులో తీసుకోవచ్చు. కానీ, అతిగా కాఫీ తీసుకుంే కూడా ప్రెగ్నెన్సీ మహిళలకు హానికరం. ఇది డీహైడ్రైషన్‌కు దారితీస్తుంది. పిండం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. . ప్రతిరోజూ 200 ఎంజీ కంటే తక్కువ మోతాదులో తీసుకోవాలి. అంటే రెండు కప్పుల టీ మీడియం సైజులో తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
ఆల్కహాల్..
ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోని మరో ఆహారం ఆల్కహాల్. ఇది పిండం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫెటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్ (FASDs). నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రెగ్నెన్సీ సమయంలో ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండటమే బెట్టర్. ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన పిండం ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter