Konda Surekha: నిన్నటి నుంచి అన్నం తినలే.. గాంధీ భవన్‌లో కన్నీళ్లు పెట్టుకున్న కొండా సురేఖ.. వీడియో ఇదే..

Konda Surekha emotional: మంత్రి కొండా సురేఖ ఎమోషనల్ అయ్యారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 30, 2024, 05:53 PM IST
  • కేటీఆర్ పై మండి పడిన కొండా సురేఖ..
  • ట్రోలింగ్ పై ఎమోషనల్ అయిన కాంగ్రెస్ మంత్రి..
Konda Surekha: నిన్నటి నుంచి అన్నం తినలే.. గాంధీ భవన్‌లో కన్నీళ్లు పెట్టుకున్న కొండా సురేఖ.. వీడియో ఇదే..

Konda surekha emotional over trolling in social media: కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంత మంది సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఎంపీ రఘునందర్ రావుతో ఉన్న ఫోటోలను షేర్ చేసి మరీ ట్రోలింగ్ లకు పాల్పడ్డారు. దీనిపై మహిళ మంత్రి గాంధీ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ మాట్లాడరు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ పార్టీ వారికి ఓడిపోయాక.. ఏంచేస్తున్నారో.. వారికే అర్థం కావట్లేదన్నారు. ఇటీవల సిద్దిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖను .. ఎంపీ పూల మాల వేసి  గౌరవించారు. దీనిపై కొంత మంది సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. దీనిపై మంత్రి కొండా సురేఖ గాంధీ భవన్ లొ మాట్లాడారు.

 

ఈ ఘటన పట్ల తన మనస్సును ఎంతో కలిచి వేసిందని .. కొండా సురేఖ భావోద్వేగానికి గురయ్యారు. అంతే కాకుండా.. తాను.. నిన్నటి నుంచి అన్నం కూడా తినలేదని, నిద్రపోలేదని కూడా కొండా సురేఖ కన్నీళ్లను సైతం పెట్టుకున్నారు.    అదే విధంగా ట్రోలింగ్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి ట్రొలింగ్ లు కవితకు చేస్తే ఊరుకుంటారా.. అనిమండి పడ్డారు. కేటీఆర్, కేసీఆర్ ఖబడ్దార్ అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఇక మీదట ట్రోలింగ్ లకు పాల్పడితే సహించేదిలేదని,  అన్ని పార్టీల వాళ్లు నన్ను అక్కా అని, నా భర్తను బావ అని పిలుస్తారన్నారు.  ఏదో ఒకరోజు ప్రజలు తిరగబడుతారని, చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమనపరుస్తారా?.. బీఆర్ఎస్ పై మండిపడ్డారు.

తనకు.. మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే కేసీఆర్ మహిళకు మంత్రిపదవి ఇవ్వలేదన్నాడు. రెండవరసారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ లో భారీ మార్పులు వచ్చాయని,  బీఆర్ఎస్ నాయకులు డబ్బు మధం ఎక్కి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారన్నారు.  కేటీఆర్, హరీష్ ఇంటి ఆడవాళ్లపై ట్రోల్ చేస్తే ఎలా ఉంటుందని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ భార్యకు.. తాను సూటిగా ఒక ప్రశ్నవేస్తున్నానని..ఈ ఫోటోలో తప్పు ఏముందో చెప్పాలన్నారు లేకపోతే.. కేసీఆర్ ను ఉరికిస్తామని కూడా కొండా సురేఖ ఫైర్ అయ్యారు.

అసభ్య కరమైన పోస్టులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. ఈ ట్రోలింగ్ పై రఘునందన్ రావు.. నాకు ఫోన్ చేసి అక్క క్షమించండి...మీరు నాకు పెద్ద అక్క లాంటి వాళ్ళు అని అన్నారు..కేటీఆర్ నీకు సిగ్గు లజ్జ ఉందా.. చేనేత కళను నువ్వు  అవమానిoచావంటు మండిపడ్డారు. గతంలో సీతక్కను, పొన్నం ప్రభాకర్ ను, మేయర్ ను కూడా ట్రోల్ చేశారన్నారు.

Read more: High court: శని, ఆదివారం కూల్చివేతలేంటీ..?. హైడ్రా‌కు చుక్కలు చూపించిన తెలంగాణ హైకోర్టు.. ఏమందంటే..?

ఇలాంటివి మళ్ళీ  జరిగితే మా కార్యకర్తలు నీ  బట్టలు విప్పించి కొడతారంటూ వార్నింగ్ ఇచ్చారు. అదే విధంగా.. అసభ్య పోస్టుల పై స్పీకర్ దృష్టి కి తీసుకువెళ్తామని కొండా సురేఖ అన్నారు. తనపై ట్రోలింగ్ చేసిన వ్యక్తి.. డీపీ హరీష్ రావు ఫోటో ఉంది కనుక హరీష్ రావు కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. బతుకమ్మ ఆట చుట్టూ డిస్కో ఆటలు నేర్పింది మీ చెల్లె కవిత కేటీఆర్...డిస్కో ఆటలు మాకు తెలవదంటూ మండిపడ్డారు. గతంలో మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంపై కూడా బీఆర్ఎస్ ట్రోలింగ్ లకు పాల్పడిందని కూడా కొండా సురేఖ సీరియస్ అయ్యారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News