మూవీ రివ్యూ: నరుడి బ్రతుకు నటన (Narudi Brathuku Natana Movie Review)
నటీనటులు: దయానంద్ రెడ్డి, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్, దయా తదితరులు
ఎడిటర్: బొంతల నాగేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: ఫహద్ అబ్దుల్ మజీద్
సంగీతం: లోపేజ్
నిర్మాణం: పీపుల్స్ మీడియా, టీజీ విశ్వ ప్రసాద్, సింధు రెడ్డి
దర్శకత్వం : రిషికేశ్వర్ యోగి
విడుదల తేది: 25-10-2024
కథ విషయానికొస్తే..
సత్య (దయానంద్).. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన పెద్దింటి కుర్రాడు. అతనికి సినిమా హీరో అవ్వాలనేది కల. అతనికి నటన అంటే ఆసక్తి ఉన్నా.. యాక్టింగ్ పై పూర్తిగా కాన్సన్ ట్రేట్ చేయడు. ఏదో తండ్రి రికమండేషన్ తో కలిసి సినిమా ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్కౌట్ కావు. తండ్రి కూడా నువ్వు నటనకు పనికి రావు అంటాడు. అదే తరహాలో అతని స్నేహితుడు కూడా ఏదో ఉద్యోగం చూసుకోమంటాడు. నటన నీ వల్ల కాదంటాడు. ఒకవేళ చేయాలనుకుంటే ఇంటి నుంచి బయటకు వచ్చి నీ బతుకు నీవు బ్రతికితే.. సమాజం ఏంటో అర్ధమవుతోంది. అపుడు ఆటోమేటిగ్ గా నీకు నటన అబ్బుతుందని చెబుతాడు. దీంతో ఎవరికీ చెప్పకుండా కేరళ వెళతాడు. అక్కడ అతనికో వ్యక్తి (D సల్మాన్) తారస పడతాడు. అతని వల్ల.. సత్య జీవితంలో ఎలాంటి మార్పలు వచ్చాయి. తాను కోరుకున్న యాక్టింగ్ వృత్తిలో సక్సెస్ అయ్యాడా.. లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తెరపై ఓ ఎమోషన్ ను పండించాలంటే అంత ఈజీ కాదు. నటన అంటే ఆషామాషీ కాదనే విషయాన్ని ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. తల్లి లేని ఓ వ్యక్తి ఎలాంటి కష్టాలు తెలియని వాడు తెరపై నవ రసాలు.. రౌద్రం, బీభత్సం, భయానకం, శాంతం, అద్భుతం, కోపం, కామెడీ ఇలా ఎమోషన్ తెలియని వ్యక్తి నటుడు కాలేడని తన సినిమాలో చూపించాడు. ఈ నేపథ్యంలో హీరో తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో భాష తెలియని కేరళకు వెళతాడు. అక్కడ అనుకోకుండా తన ఫోన్ పోగోట్టుకోవడం వంటివి సినిమాటిక్ గా ఉంటాయి. అక్కడ ఓ స్నేహితుడు కలవడంతో అతనికి అన్ని ఎమోషన్స్ తెలిసొచ్చాయి. చివరకు హీరో అవ్వాలనుకున్న కలను ఎలా నెరవేర్చుకున్నాడనేది దర్శకుడు ఎంతో భావోద్వేగంతో తెరకెక్కించాడు. అటు ఓ అమ్మాయి డబ్బుల కోసం అద్దె గర్భం దాల్చడం వంటివి పేదల కష్టాలను కళ్లకు కట్టేలా చూపించాడు.
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ హీరో ఎమోషన్ తెలియని వ్యక్తి నటన పండించలేడనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో సాదాసీదా నడిపించినా.. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురయ్యేలా చేసాడు. మొత్తంగా తాను చెప్పాలనుకున్న అంశాలన్ని ఇంకాస్త ఎఫెక్ట్ గా చెప్పి ఉంటే బాగుండేది. సినిమాలో హీరో, అతని స్నేహితుడు అక్కడక్కడ బీఫ్ తినడం లాంటివి చూపించడం వంటివి మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా ఉంది. బీఫ్ కు బదులు మీట్ పెట్టింటే బాగుండేది. సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్ బాగుంది. సినిమా ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. ఈ సినిమాలో నిర్మాత టేస్ట్ కనిపిస్తుంది. మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే తాపత్రయం కనబడింది. ఇలాంటి చిత్రాల్ని టేకప్ చేసి రిలీజ్ చేయడంలో పీపుల్స్ మీడియా, టీజీ విశ్వ ప్రసాద్ టేస్ట్ కూడా కనిపిస్తోంది.
నటీనటుల విషయానికొస్తే..
దయానంద్ రెడ్డి.. ఎమోషన్ పండించలేని నటుడి పాత్రలో మెప్పించాడు. అతడి స్నేహితుడు డి సల్మాన్ పాత్రలో నటించిన నితిన్ ప్రసన్న నటన బాగుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ లైన్.. ‘నరుడి బ్రతుకు నటన’..భావోద్వేగాల ఓ వ్యక్తి ప్రయాణం..
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter