హార్దిక్, నటాషాలకు శుభాకాంక్షలు తెలిపిన కృనాల్

సెర్బియా జాతీయురాలు, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ తో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య నిశ్చితార్థం జరుపుకోవడం ఇప్పుడు క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలిసినా, హార్దిక్ ఇంత వేగంగా వ్యవహరిస్తాడని ఎవరూ ఊహించలేదు.

Last Updated : Jan 2, 2020, 08:05 PM IST
హార్దిక్, నటాషాలకు శుభాకాంక్షలు తెలిపిన కృనాల్

హైదరాబాద్: సెర్బియా జాతీయురాలు, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ తో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య నిశ్చితార్థం జరుపుకోవడం ఇప్పుడు క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలిసినా, హార్దిక్ ఇంత వేగంగా వ్యవహరిస్తాడని ఎవరూ ఊహించలేదు.

హార్థిక్ పాండ్య తన నిశ్చితార్ధ నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి లోను చేసిందని కృనాల్ పేర్కొన్నాడు.  దుబాయ్ లో తన ప్రేయసికి ప్రపోజ్ చేసిన హార్దిక్ పాండ్య బాలీవుడ్ తార నటాషా నుంచి అంగీకారం తీసుకున్నాడు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్య సోదరుడు, కృనాల్ పాండ్య స్పందించాడు. తన కాబోయే మరదులు నటాషాకు స్వాగతం పలికాడు. 'మా క్రేజీ కుటుంబంతో నువ్వు జత కలవడం ఎంతో ఆనందంగా ఉంది. కంగ్రాట్స్ హార్దిక్, నటాషా... మీ ఇద్దర్నీ ప్రేమిస్తున్నాం' అంటూ ట్వీట్ చేశాడు.

Trending News