బెంగళూరు: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ అసలైన సమరం నేడు జరగనుంది. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ వన్డేలో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత రెండు మ్యాచ్‌లలో టాస్ నెగ్గిన ఫించ్‌ను సిరీస్ ఫలితాన్ని నిర్దేశించే మూడో వన్డేలోనూ టాస్ వరించింది. భారత జట్టులో ఏ మార్పులు లేవని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కాగా, ఆసీస్ ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. కేన్ రిచర్డ్ సన్ను తప్పించి జోష్ హేజిల్‌వుడ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
Also Read: ధోనీని అధిగమించిన కేఎల్ రాహుల్
ముంబైలోని వాంఖడేలో జరిగిన తొలి వన్డేలో భారత్ చేతులెత్తేయగా.. రెండో వన్డేలో పుంజుకున్న విరాట్ కోహ్లీ సేన ఆసీస్‌కు షాకిచ్చింది. దీంతో ప్రస్తుతానికి వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉంది. నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మధ్యాహ్నం ప్రారంభమయ్యే వన్డేలో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుందని తెలిసిందే. అయితే భారత్‌ను గాయలబెడద కలవరపెడుతోంది.
2019లో జరిగిన వన్డే సిరీస్ ఫలితం రిపీట్ కాకూడదని టీమిండియా భావిస్తోంది. ఆ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో ఓడిన ఆసీస్.. తర్వాత వరుస మూడు మ్యాచ్‌లు నెగ్గి 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది. అందుకే భారత్ రాజ్ కోట్ వన్డే తరహాలో సమష్టిగా రాణించాలని ప్లాన్ చేస్తోంది. తొలి వన్డేలో వీర విహారం చేసిన ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ రెండో వన్డేలో ఆకట్టుకోలేదు. దీంతో కీలకమైన బెంగళూరు వన్డేలో వారిని ఆపకుంటే సిరీస్‌పై ఆశలు వదులుకోవాల్సిందే.
భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, నవదీప్ షైనీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ
ఆసీస్ తుది జట్టు:
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), అస్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్, మార్కస్ లబుషేన్, మిచెల్ స్టార్క్, అస్టన్ టర్నర్, ఆడమ్ జంపా