Retirement Age: ఇటీవల కొద్దిరోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచారనే వార్త వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ వయస్సుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచిందనే వార్త గట్టిగా ప్రచారమౌతోంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండేళ్ల సర్వీసు పెరగనుంది.
అయితే ఈ వార్త ఎంత వరకూ నిజమనేది ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు అంతా అవాస్తవమని తేలింది. రిటైర్మెంట్ వయస్సు పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. రిటైర్మెంట్ వయస్సు పెంచారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది. వాస్తవానికి ఇలా ప్రచారం జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ఇలా ప్రచారమైనప్పుడు అసలు అలాంటి ప్రతిపాదనే లేదని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సుని మరో రెండేళ్లు పెంచి 62 ఏళ్లు చేశారని, కేంద్ర కేబినెట్లో ఈ విషయమైన నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త ఆదేశాలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయనే ప్రచారం సాగింది. అందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని అందులో ఉంది.
అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఇదంతా అబద్ధమని తేలింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచారంటూ వస్తున్న వార్తలు ఫేక్ అని తేలిపోయింది. అసలు ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదనే లేదని తేలింది. ఈ విషయమై గత ఏడాదే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టత ఇచ్చారు. రిటైర్మెంట్ వయసు పెంచే ఆలోచన లేదని తెలిపారు.
Also read: Currency Showering: అతిథులకు మర్యాద అంటే ఇది.. పెళ్లికి వచ్చిన వారిపై కురిసిన నోట్ల వర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.