Viral Video: చైతు, శోభిత పెళ్లిలో బిందెలో ఉంగరం.. ఎవరు తీశారో తెలుసా..?.. వీడియో ఇదే..

Sobhita chaitu wedding: చైతు శోభితల పెళ్లి అన్న పూర్ణ స్టూడియోస్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈవేడుకకు అన్నిరంగాల నుంచి ప్రముఖులు హజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకలకు  సంబంధించిన పిక్స్, వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 6, 2024, 01:45 PM IST
  • గ్రాండ్ గా చైతు, శోభితల పెళ్లి..
  • నెట్టింట ట్రెండింగ్ గా మారిన వీడియో..
Viral Video: చైతు, శోభిత పెళ్లిలో బిందెలో ఉంగరం.. ఎవరు తీశారో తెలుసా..?.. వీడియో ఇదే..

chaitu sobhita wedding video viral: నాగచైతన్య, శోభితల పెళ్లి డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో వేడుకగా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన  చైతు, శోభితల పెళ్లి పిక్స్, పెళ్లికి సంబంధించిన వార్తలు ట్రెండింగ్ లో ఉన్నాయి.  చైతు, శోభితల పెళ్లి డిసెంబరు 4న రాత్రి 8.13 నిముషాలకు జరిగినట్లు తెలుస్తొంది. సంప్రదాయ బద్దంగా.. దాదాపు 8 గంటల పాటు పెళ్లి క్రతువు జరిగినట్లు తెలుస్తొంది. చైతు తెల్లని షేర్వాణి వేసుకున్నాడు.

శోభిత తెలుపు బంగారు వర్ణం చీర కట్టుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా వీరి చైతు మంగళ సూత్రం కట్టేటప్పుడు మాత్రం.. అఖిల్ ఒక్కసారిగా ఈల వేయడం మాత్రం.. ఆ పందిరిలో హైలెట్ గా మారిందని చెప్పుకొవచ్చు. మరొవైపు శోభిత మాత్రం.. చైతు తాళి కడుతుంటే.. ఎంతో ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. ఆమె కళ్లలో ఆనంద భాష్పాలు వచ్చాయని తెలుస్తొంది.అదే విధంగా వీరి పెళ్లిలో ప్రతి కార్యక్రమం కూడా ఎంతో గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తొంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Naga Chaitanya Fans (@nagachaitanyafanss)

 

అదే విధంగా.. అక్కినేని నాగేశ్వర రావు విగ్రహం ముందు కూడా.. కొత్త జంట ప్రత్యేకంగా నిలబడి ఆశీర్వాదాలు తీసుకున్నారు. నాగార్జున వీటికి సంబంధించిన పిక్స్ ను తన ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. వీరి పెళ్లిలో ప్రస్తుతం బిందెలో ఉంగరం వేసి  కొత్త జంటతో ఆటడిస్తారు. అయితే.. విష్ణు పురాణం ప్రకారం.. విష్ణుదేవుడు, లక్ష్మీ అమ్మవారు సైతం ఈ ఆటను ఆడారంట. అందుకే అనాదీగా కొత్త జంటతో ఈ ఆటను ఆడించడం సంప్రదాయంగా వస్తున్నట్లు తెలుస్తొంది.

ఈ క్రమంలో చైతు.. శోభితలు.. ఇద్దరు కొత్త బిందెలో.. ఉంగరం కోసం పోటా పోటీగా చేయ్యిపెట్టి మరీ ఉంగరం కోసం వెతికినట్లు తెలుస్తొంది. కానీ చివరకు చైతు మాత్రం ఉంగరం ను బైటకు తీసినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన అక్కినేని అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారంట. 
 

Trending News