Brahmamudi Today: ఇందిరా దేవి మిస్సింగ్‌.. కావ్యకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన కల్యాణ్‌, ఎస్సై ట్రైనింగ్‌లో అప్పు అలా..

Brahmamudi December 9 Episode:  అందరూ కలిసి నా నోరు నొక్కేయాలని చూస్తున్నారు అంటూ ఉండగా ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకున్న ఇందిరా దేవి ఆపండి.. అసలు ఎవరు మీరంతా? ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఉన్నవారేనా? అంటుంది. ఇలాంటి  కుటుంబంలో ఎలాంటి వారు తయారయ్యారు. ఇంటి పెద్దకు ఆపద వస్తే అందరూ కలిసి ఎలా కాపాడుకోవాలని ఆరాటపడతారు. ఆయనకు ఏదైనా అయితే, ఆస్తులు ఎలా దక్కించుకోవాలని ఆలోచిస్తున్నారా?

Written by - Renuka Godugu | Last Updated : Dec 9, 2024, 08:57 AM IST
Brahmamudi Today: ఇందిరా దేవి మిస్సింగ్‌.. కావ్యకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన కల్యాణ్‌, ఎస్సై ట్రైనింగ్‌లో అప్పు అలా..

Brahmamudi December 9 Episode: మీ మామగారికి నేనెప్పుడూ ఎదురు వెళ్లలేదు. తోడికోడలు ఏపని చెప్పినా చేసేదాన్ని, మరుదుల ముందు కూర్చిలో కూడా కూర్చోలేదు. ఆడపడచు వస్తే నీళ్లు ఇచ్చేదాన్ని, అత్తగారి కాళ్లు పట్టేదాన్ని బంధువులు వస్తే ఇంకొన్ని రోజులు ఉండమనేదాన్ని, వియ్యాలవారు వస్తే విందు భోజనాలు పెట్టేదాన్ని అలాంటి ఇంటి నుంచి వచ్చాను. ఇద్దరు కోడళ్లను ఇంటి ఆడపిల్లలుగా చూసుకున్నా.. ఈనాడు నాకు కష్టం వస్తే ఓదార్చడం పోయి ఇంత అన్నం కూడా తినకుండా చేస్తున్నారే.. మీరసలు మనుషులేనా అంటుంది.  నేను పండంటి సంసారం నాది అనుకున్న ఎవరికి ఇవ్వాల్సిన విలువ వారికి ఇచ్చా. నువ్వు ఆస్తుల గురించి మాట్లాడుతున్నావా? ధాన్యలక్ష్మి నీకంటే పిశాచులు నయ్యం అని ఛీకొట్టి వెళ్తుంది ఇందిరాదేవి.

అమ్మమ్మ కోసం ఫుడ్‌ తీసుకెళ్తుంది కావ్య. సరే పదా నేను కూడా వస్తా అని అపర్ణదేవి కూడా వెళ్తుంది. ఇదేంటి అత్తయ్యగారు ఎక్కడ ఉన్నారు? బయట కూడా లేరు. నేను గదిలో ఉందానుకున్నా.. అమ్మమ్మగారు ఎక్కడికి వెళ్లిందో నాకు తెలుసు. ఇంట్లోవారన్న మాటకు బాధపడి తాతయ్యగారి దగ్గరికి వెళ్లారు అంటుంది కావ్య.

మరోవైపు ఆసుపత్రిలో ఇందిరాదేవి. ఏంటి బావా? ఇలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నావు. నీ చిట్టి ఎలా భరిస్తుంది అనుకున్నావు అని ఏడుస్తూ ఉంటుంది. ఈలోగా కవి లోపలికి వచ్చి తాతయ్యకు ఏంకాదు నానమ్మ, త్వరలోనే కోలుకుంటాడు అని ఓదారుస్తాడు. ఆ ఆశ చచ్చిపోయింది కల్యాణ్‌ ఆ ఇంట్లో ఆనందం లేకుండా పోయింది. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఎవరు ఏమైతే మాకేంటి అంటున్నారు. ఇన్నేళ్లు ఆ ఇంటి పరువు ప్రతిష్టలను గుప్పిట్లో పెట్టుకుని వచ్చాను. ఆయన తర్వాత కూడా అలాగే ఉంటారు అనుకున్నారు.

కానీ, పచ్చని చెట్టుకు కుళ్లుకుతాంత్రాలు పాకి ఇప్పుడు వేళ్లకు కూడా పట్టింది. అందుకే మహావృక్షంలాంటి మీ తాతయ్య ఈరోజు ఇలా జీవచ్చవంలా పడిఉన్నారు. పిల్లలకు బాధ్యతలు అప్పగించి మనిద్దరం ప్రపంచాన్ని చుట్టేద్దాం అన్నారు. అలా అనకు నానమ్మ మంచి రోజులు కూడా వస్తాయి అంటాడు కవి. అప్పుడే కావ్య మీ పాటిటి ఇలా వచ్చేస్తే ఎక్కడకు వెళ్లారు అనుకోవాలి. ఆ ఇంట్లో అన్ని హక్కులు ఉన్నమీరు ఏ దిక్కు లేనట్లు ఇక్కడకు వచ్చి ఏడుస్తున్నారు.

నేను కనిపించకపోతే ఆ ఇంట్లో బాధపడేవారు లేరు అంటుంది ఇందిరా దేవి. నేను లేనా అంటుంది కావ్య.. ఇంకేం మాట్లాడకండి మీకోసం నేను అన్నం తీసుకువచ్చా తినండి అంటుంది. మీరు తినలేదని నేను కూడా తినలేదు అంటుంది. నేను తినలేదని నువ్వేందుకు తినలేదు. నేను అంత స్వర్థపరురాలిని కాదు నేను మీరు తిన్న తర్వాతే నేను తింట.నేను కృంగి కృశించి పోయి తాతగారి బెడ్ పక్కనే నేను వేసుకుంటా. మా ఇద్దరి పక్కన కూర్చొని మీరు ఏడవాల్సి వస్తుంది అని అన్నం తినడానికి ఒప్పిస్తుంది కావ్య. అమ్మమ్మగారికి తానే స్వయంగా భోజనం తినిపిస్తుంది. దీంతో కన్నీటిపర్యాంతమవుతుంది ఇందిరా దేవి. ఇక కావ్య అమ్మమ్మగారిని నవ్వించడానికి కొన్ని మాటలు చెబుతూ భోజనం తినిపిస్తుంది.

ఇదీ చదవండి:  అంతా గోవింద నామస్మరణం.. ఆదివారం కిక్కిరిసిపోయిన భక్తజనం..!  

కవి, కావ్యలు ఇద్దరూ బయట మాట్లాడుతుంటారు. కవిగారు.. డాక్టర్‌ ఏమన్నారు అంటుంది. ఎప్పుడు కోమాలో నుంచి బయటకు వస్తారో చెప్పలేం అన్నారు. దీంతో షాక్‌కు గురవుతుంది కావ్య. అవును.. అప్పు ఎక్కడ? తీసుకురాలేదా? అంటుంది కావ్య. తను ఎస్సై సెలక్షన్‌లో రాతపరీక్షలో పాసైంది అంటాడు. దీంతో సంతోషించిన కావ్య మరి శుభవార్తను ఇలా చెప్తావు అంటుంది. తాతయ్య గురించి కూడా చెప్పలేదు అంటాడు. తను మానసికంగా ఇబ్బంది పడటం ఇష్టంలేక తాతయ్య సంగతి చెప్పలేదు అంటాడు. 

ఇంట్లో ప్రతిరోజూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ప్రతిక్షణం ఏం జరుగుతుందో అని యుద్ధం జరుగుతుంది. తాతయ్యగారు మీరు అన్ని అధికారులు ఇచ్చారు. నీరాకతో దుగ్గిరాల కుటుంబానికి మంచి రోజులు వస్తాయి అంటాడు. కావ్య మాత్రం నాకు లేదు ఆ ఇంట్లో బాధ్యతలు భారంగా మారతాయి అంటుంది.

మరోవైపు ధాన్యలక్షి ఆస్తిలో వాట కల్యాణ్‌ పేరున రాయడానికి పత్రాలు రెడీ చేస్తుంది. వెంటనే వాటిని ప్రకాశం చించేస్తాడు. అవుతలా మామయ్య గారు రేపో మాపో అన్నట్లు ఉన్నాడు అంటుంది. దీంతో నోర్మూయ్‌ అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నావ్. ఇలా పశువులా మారి గడ్డి తింటున్నావ్‌. బంగారం మోజు ఉండే ఆడవాళ్లకు అందరికీ ఉంటుంది ఇలా తప్పు చేస్తున్నావ్‌. ఆ రుద్రాణీ నీకు ఏం నూరిపోస్తుందో దేనికైనా సమయం సందర్భం ఉంటుంది. ఇంట్లో ఎవరికీ ప్రశాంతత లేదు అని వెళ్లిపోతాడు. నాకు ఆస్తి పిచ్చికాదు. నీకే అమ్మనాన్న పిచ్చి పట్టింది అంటుంది ధాన్యం.

ఇదీ చదవండి:  Brahmamudi Serial Today: రుద్రాణీదే విజయం.. కోమాలోకి సీతారామయ్య రేపే ఆస్తి పంపకాలు

కావ్య దోమలు కొట్టుకుంటూ వంటగదిలో పడుకుని ఉంటుంది. అప్పుడే అపర్ణ కావ్య.. కావ్య నువ్వేంటి ఈ ఇంట్లో నీ స్థానం ఏంటి? అంటుంది. నువ్వు గదికి వెళ్లలేదా? అంటుంది. లేదు ఆయన పిలువకుండా నేను గదికి ఎలా వెళ్లాలి. అసలు నువ్వు పనిమనిషిలా వంటగదిలో పడుకున్నావ్‌. మీ అమ్మమ్మ తాతయ్య నిన్ను ఈ ఇంటికి తీసుకువచ్చింది ఈ ఇంటి కోడలులా.. నీకు సర్వ హక్కులు ఉంటాయి. పరిచయం లేని వ్యక్తి పక్కసీటులో కూర్చున్నట్లు ఆయన చూస్తున్నారు అంటుంది కావ్య. నీకు అన్ని హక్కులు ఉన్నాయి. అని రాజ్‌ను కేకలు వేస్తూ పిలుస్తుంది. ఏంటి మమ్మి అని కిందకు వస్తాడు. తను ఎవరు? అంటుంది అపర్ణ, కళావతి అంటాడు ఈ ఇంట్లో ఎందుకు ఉంది? అయితే పంపించేద్దాం మమ్మి అంటాడు. ఇంత రాత్రైనా నీ గదికి రాకపోతే ఎందుకు రాలేదు అని పట్టించుకోవా? అంటుంది. 

ఏయ్‌.. ఇక్కడ నేల మీద పడుకున్నావా? అంత మానవత్వం లేదనుకున్నావా? అంటాడు రాజ్‌. మరి ఎక్కడ పడుకోవాలి? అంటుంది అపర్ణ.. ఇక నావాటా నాకు పంచండి అని ధాన్యం .. ఎవరి వాట వారికి ఇవ్వాల్సిందే అని రుద్రాణి అంటుంది. విడిపోయి దరిద్రాన్ని వదిలించుకోవడం మంచిది. రేపే లాయర్‌ను పిలిపించి ఆస్తులు పంచేస్తా అంటాడు రాజ్‌ తండ్రి.. ఇది కూడా రేపటి ఎపిసోడ్‌లో టెలిక్యాస్ట్‌ అయినట్లు చూపిస్తారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News