AP and Tamilnadu Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తమిళనాడు, శ్రీలంక దిశగా కదులుతున్నా ఏపీను మాత్రం వదలడం లేదు. ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. అటు తమిళనాడులోని 17 జిల్లాలను సైతం వణికిస్తోంది. మరో మూడు రోజులు భారీ వర్షాల ముప్పు ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శ్రీలంక, తమిళనాడు దిశగా కదులుతోంది. ఇవాళ రాత్రికి అల్పపీడనం బలహీనపడవచ్చు. అయితే ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తిరుపతి, తిరుమల, చిత్తూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, తిరుమల ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇటీవల ఫెంగల్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగం భారీ వర్షాలతో గగ్గోలు పెడుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, గూడూరు, సూళ్లూరు పేట, కావలిలో నిన్నటి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా స్వర్ణముఖి బ్యారేజ్‌కు వరద నీరు చేరుతోంది. మరో మూడ్రోజులు భారీ వర్షాల హెచ్చరిక జారీ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
భారీ వర్షాల కారణంగా తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. చెరువులు, వాగులు, వంకలు పొగి ప్రవహిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది.
తమిళనాడుపై తీవ్ర ప్రభావం
మరోవైపు తమిళనాడుపై అల్లపీడనం ప్రభావం ఎక్కువగా ఉంది. మరోసారి కుండపోత వర్షాలతో చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని 17 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణం అనుకూలించకపోవడంతో చెన్నై విమానాశ్రయంలోనూ, రేణిగుంటలోనూ విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు విమానాలు ఆలస్యంగా ఉన్నాయి.
Also read: Cold Waves: తెలంగాణను వణికిస్తున్న చలి, వచ్చే 3 రోజులు 4-5 డిగ్రీలకు ఉష్ణోగ్రత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.