Viral Video:ఇదెక్కడి విడ్డూరం.. చిరుతను అమాంతం లాక్కెళ్లిపోతున్న గద్ద.. షాకింగ్ వీడియో వైరల్..

Eagle attacks on Leopard: గద్ద చిరుతపులికి చుక్కలు చూపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. నెటిజన్లు షాక్ అవుతున్నారు.  చూస్తేనే భయంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 20, 2024, 02:52 PM IST
  • చిరుతకు చుక్కలు చూపించిన గద్ద..
  • ఆశ్యర్యపోతున్న నెటిజన్లు..
Viral Video:ఇదెక్కడి విడ్డూరం.. చిరుతను అమాంతం లాక్కెళ్లిపోతున్న గద్ద.. షాకింగ్ వీడియో వైరల్..

Eagle Attacks on Leopard video goes viral: సాధారణంగా గద్దలు పాముల్ని పట్టుకొనిపోతుంటాయి. కొన్నిసార్లు.. పిల్లులు, కోళ్లను ఆకాశం నుంచి అమాంతం నెలమీదకు వచ్చి.. దాడులు చేసి పట్టుకుని వెళ్లిపోతుంటాయి. ఇది మనం తరచుగా చూస్తుంటాం. అదే విధంగా గద్దలు.. అత్యంత ఎత్తులో ఆకాశం నుంచి భూమి మీద ఉన్న చిన్న చీమల్ని కూడా చూడగలవంట. అవి పదునైన తమ కాళ్ల గొర్లు, ముక్కులతో వేటపై దాడులు చేస్తాయి. అదేవిధంగా గద్దలు దాడి చేశాయంటే.. ఆ జీవి మాత్రం చనిపోవాల్సిందే. చాలా సార్లు.. గద్ద.. పాములు కొట్టుకున్న సంఘనలు వైరల్ గా మారాయి.

అయితే.. సోషల్ మీడియాలో తరచుగా అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో వెరైటీ ఉన్న వాటిని నెటిజన్లు  చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు.
ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుందని చెప్పుకొవచ్చు. ఒక భారీ గద్ద భూమి మీదకు వచ్చి.. చిరుతపులిపై దాడి చేసింది. అంతేకాకుండా.. దాన్ని కిందకు పడగొట్టి.. దాని మాంసం సైతం తినేసింది.

 

అంతే కాకుండా.. తన రెండు కాళ్లతో చిరుతను పట్టుకుని అమాంతం బలమైన రెక్కలతో పైకి ఎగిరి మరోక చోటికి తీసుకొని వెళ్తుంది.ఈ వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మరీ ఇది నిజమా.. చిరుత అంత ఈజీగా గద్దకు చిక్కుతుందా.. అని కొంతరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ కళ్ల ముందు వీడియో కన్పిస్తుంది.. ఇది ఎక్కడ జరిగిందో వివరాలు లేవు.

Read more: Viral Video: ఓర్నీ.. ఇవేం స్టెప్పులు భయ్యా.. చలికాలంలో డ్యాన్స్‌తో హీట్ పుట్టిస్తున్న యువతి.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..

కానీ ఈ వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట దుమ్మురేపుతుందని చెప్పుకొవచ్చు. మరొవైపు గద్ద దాడులు చేస్తున్న కూడా.. చిరుత పారిపోకుండా.. అక్కడ ఎందుకు ఉండిపోయిందని కూడా కొంత మంది అనుమానంతో ఈ వీడియోను అదేపనిగా చూస్తున్నారంట.  ఏదీ ఏమైన ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News